భాగం 12
మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?
కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. ఎఫెసీయులు 5:33
వివాహ బంధం ఒక పురుషునికి, ఒక స్త్రీకి మధ్య మాత్రమే ఉండాలని దేవుడు చెప్తున్నాడు.
ప్రేమగల భర్త తన భార్యను ఆప్యాయంగా చూసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు.
భార్య తన భర్తకు సహకరించాలి.
పిల్లలు అమ్మానాన్నల మాట వినాలి.
దయ చూపిస్తూ నమ్మకంగా ఉండండి. కఠినంగా ఉండకండి, ద్రోహం చేయకండి. కొలొస్సయులు 3:5, 8-10
భర్త తన శరీరాన్ని ప్రేమించుకున్నట్టే భార్యను ప్రేమించాలని, భార్యకు భర్త మీద చాలా గౌరవం ఉండాలని బైబిలు చెప్తుంది.
అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడం తప్పు.
కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో యెహోవా వాక్యం చెప్తుంది.