యేసును చూసి నేర్చుకోండి
దేవునికి దగ్గరవ్వడానికి సమయం పెట్టండి
రోజూ కొంచెం సమయం తీసుకుని దేవునికి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే, మీరు జీవితంలో దేవుని నిర్దేశాన్ని కోరుకుంటున్నట్టే. అలాచేస్తే, మీ లైఫ్ చాలా బాగుంటుంది. దీని గురించి యేసు ఏం చెప్పాడో చూడండి.
యేసు ఏం చెప్పాడు?
“దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”—మత్తయి 5:3.
మనలో చాలామందిమి ఈ ప్రశ్నల గురించి ఆలోచించే ఉంటాం: జీవితానికి అర్థం ఏంటి? లోకంలో ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి? చనిపోయాక ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే మనం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటాం.
“మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదుగానీ యెహోవాa నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవించాలి.”—మత్తయి 4:4.
మనం బ్రతకడానికి రోజూ ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, దేవుని నిర్దేశం తీసుకోవడం కూడా అంతే అవసరం. కాబట్టి రోజూ దేవుని సహాయం తీసుకుంటూ ఉండాలని యేసు చెప్పాడు.
“నీ వాక్యమే సత్యం.”—యోహాను 17:17.
దేవుని నిర్దేశం మనకు ఎక్కడ దొరుకుతుందో యేసు చెప్పాడు. దేవుని వాక్యమైన బైబిల్లో అది దొరుకుతుంది.
దేవుని కోసం సమయం పెట్టి, ఆయన నిర్దేశం తీసుకుంటూ నిజమైన సంతోషాన్ని సొంతం చేసుకోండి. ఇవి మీకు సాయం చేస్తాయేమో చూడండి:
ఉచితంగా బైబిలు చదవండి.
యెహోవాసాక్షులు ఇచ్చే బైబిలు స్టడీ కోర్సు కోసం అడగండి.
a దేవుని పేరు యెహోవా. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” ఆర్టికల్ చూడండి.