కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 140
  • అర్ధరాత్రికి ఇంకా దగ్గరైన డూమ్స్‌డే క్లాక్‌

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అర్ధరాత్రికి ఇంకా దగ్గరైన డూమ్స్‌డే క్లాక్‌
  • అదనపు అంశాలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భవిష్యత్తులో అసలేం జరుగుతుంది?
  • పాజిటివ్‌గా ఉండండి
  • శాస్త్రవేత్తలు డూమ్స్‌డే క్లాక్‌ను ముందుకు జరిపారు—బైబిలు ఏం చెప్తోంది?
    అదనపు అంశాలు
  • ఈ ప్రపంచం ఇలానే ఉంటుందా లేక నాశనం అవుతుందా?
    తేజరిల్లు!—2017
  • ఈ లోకాంతం దగ్గర్లో ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • లోకం త్వరలో అంతం కాబోతుందా? లోకాంతం అంటే ఏమిటి?
    అదనపు అంశాలు
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 140
డూమ్స్‌డే క్లాక్‌ ఇప్పుడు అర్ధరాత్రికి 85 సెకన్ల దూరంలోనే ఉంది.

Courtesy Jamie Christiani/Bulletin of the Atomic Scientists

అప్రమత్తంగా ఉండండి!

అర్ధరాత్రికి ఇంకా దగ్గరైన డూమ్స్‌డే క్లాక్‌

శాస్త్రవేత్తలు జనవరి 27న, డూమ్స్‌డే క్లాక్‌నుa అర్థరాత్రికి ఇంకా దగ్గరగా జరిపారు. ఇక్కడ అర్ధరాత్రి అంటే, మనుషుల వల్ల భూమంతటా కలిగే వినాశనం.

  • “బులెటిన్‌ ఆఫ్‌ ద అటామిక్‌ సైంటిస్ట్స్‌ సైన్స్‌ అండ్‌ సెక్యూరిటీ బోర్డ్‌ ఈరోజు డూమ్స్‌డే క్లాక్‌ను అర్ధరాత్రికి 85 సెకన్ల దగ్గరికి జరిపారు. ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా విధ్వంసానికి చేరువైంది.”—బులెటిన్‌ ఆఫ్‌ ద అటామిక్‌ సైంటిస్ట్స్‌.

  • “సైంటిస్టులు డూమ్స్‌డే క్లాక్‌ ద్వారా విషయాన్ని చాలా స్పష్టం చేయాలనుకుంటున్నారు. రోజురోజుకి పరిస్థితులు విషమిస్తున్నాయి. మనుషుల మధ్య సహకారం తగ్గిపోతుంది. పైగా మనకి ఎక్కువ టైమ్‌ కూడా లేదు. మార్పు చాలా అవసరం, అది సాధ్యమే. ఇంకా మించిపోయిందేమీ లేదు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరు తమ నాయకుల్ని ఏదోఒక చర్య తీసుకునేలా పట్టుబట్టాలి.”—అలెగ్జాండర్‌ బెల్‌, బులెటిన్‌ ఆఫ్‌ ద అటామిక్‌ సైంటిస్ట్స్‌ ప్రెసిడెంట్‌, సిఈవో

మనుషులు త్వరలో అంతరించిపోతారా? భూమి ఇక నాశనం అయిపోతుందా? భవిష్యత్తు గురించి మనం భయపడాలా? బైబిలు ఏం చెప్తోంది?

భవిష్యత్తులో అసలేం జరుగుతుంది?

బైబిలు ప్రకారం, “భూమి ఎప్పటికీ నిలిచివుంటుంది,” అలాగే ప్రజలు దానిమీద “శాశ్వతంగా జీవిస్తారు.” (ప్రసంగి 1:4; కీర్తన 37:29) కాబట్టి మనుషులు భూమిని నాశనం చేయలేరు, లేదా జీవించడానికి వీల్లేనంతగా పాడు చేయలేరు.

అయితే, బైబిలు ఒక అంతం గురించి మాట్లాడుతోంది. ఉదాహరణకు, బైబిలు ‘లోకం నాశనం కాబోతుంది’ అని చెప్తుంది.—1 యోహాను 2:17.

  • ఈ లోకం నాశనం కాబోతుంది అని బైబిల్లో ఉన్న మాటలకు అర్థం ఏంటో తెలుసుకోవడానికి, “లోకం త్వరలో అంతం కాబోతుందా? లోకాంతం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చదవండి.

  • త్వరలో ప్రపంచవ్యాప్తంగా జరగబోయే సంఘటనల గురించి అర్థంచేసుకోవడానికి, “లోకం ఎప్పుడు అంతమౌతుంది?” అనే ఆర్టికల్‌ చదవండి.

పాజిటివ్‌గా ఉండండి

ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉన్నా, ప్రశాంతంగా ఉండేలా బైబిలు మనకు సహాయం చేస్తుంది. ఎలా?

  • బైబిలు మనకు ఉపయోగపడే సలహాల్ని ఇస్తుంది. (2 తిమోతి 3:16, 17) ఉదాహరణకు, మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, పాజిటివ్‌గా ఉండడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోవాలంటే, “ఆందోళనను ఎలా తగ్గించుకోవచ్చు?” అనే ఆర్టికల్‌ చదవండి.

  • బైబిలు భవిష్యత్తు గురించి ఒక మంచి ఆశను ఇస్తుంది. (రోమీయులు 15:4) అంతేకాదు, ఇప్పుడూ అలాగే భవిష్యత్తులో ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్తుంది. దానివల్ల ముందుముందు ఎలాంటి సంఘటనలు జరిగినాసరే ధైర్యంగా ఉండగలుగుతాం.

బైబిల్లో ఉన్న విషయాల్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ఇచ్చే ఉచిత బైబిలు స్టడీ కోర్సు తీసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

a ‘మనం కనిపెట్టిన ప్రమాదకరమైన టెక్నాలజీల వల్ల ప్రపంచం నాశనం అవ్వడానికి ఎంత దగ్గర్లో ఉందో ప్రజలు తెలుసుకోవాలని ఈ డూమ్స్‌డే క్లాక్‌ను ఒక గుర్తుగా ఉపయోగిస్తున్నారు. ఈ గ్రహం మీద మనం బతికి బట్టకట్టాలంటే, రాబోయే ప్రమాదాల్ని ఆపడానికి ఖచ్చితంగా ఏదోకటి చేయాలని ఇది హెచ్చరిస్తుంది.’—బులెటిన్‌ ఆఫ్‌ ద అటామిక్‌ సైన్‌టిస్ట్స్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి