కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 20
  • యెహోవాసాక్షులు వైద్య చికిత్సలు చేయించుకుంటారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులు వైద్య చికిత్సలు చేయించుకుంటారా?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు దాన్ని వాయిదా వేస్తున్నారా?
    మన రాజ్య పరిచర్య—2008
  • అత్యవసర పరిస్థితుల్లో ఏ చికిత్స చేయించుకోవాలో నిర్ణయించుకున్నారా?
    మన రాజ్య పరిచర్య—2012
  • వాయిదా వేస్తున్నారా?
    మన రాజ్య పరిచర్య—2010
  • మీరు ఏవి ఎంపిక చేసుకునే అవకాశముందో మీకు తెలుసా?
    మన రాజ్య పరిచర్య—2009
మరిన్ని
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 20

యెహోవాసాక్షులు వైద్య చికిత్సలు చేయించుకుంటారా?

యెహోవాసాక్షులు తప్పకుండా వైద్య చికిత్సలు చేయించుకుంటారు, మందులు వాడతారు. మేము శరీరం పట్ల శ్రద్ధ తీసుకుంటాం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తాం. అయితే, కొన్నిసార్లు ‘వైద్యుని’ దగ్గరకు కూడా వెళ్తాం. (లూకా 5:31) నిజానికి మొదటి శతాబ్దంలో జీవించిన శిష్యుడైన లూకా లాగానే మాలో కూడా కొంతమంది డాక్టర్లు ఉన్నారు.—కొలొస్సయులు 4:14.

కానీ కొన్నిరకాల వైద్య చికిత్సలు బైబిలు సూత్రాలకు విరుద్ధమైనవి, వాటిని మేము అంగీకరించం. ఉదాహరణకు మేము రక్తమార్పిడులకు ఒప్పుకోం, ఎందుకంటే శరీర పోషణ కోసం రక్తం తీసుకోవడం బైబిలుకు వ్యతిరేకం. (అపొస్తలుల కార్యములు 15:20) అలాగే మంత్రతంత్రాలకు సంబంధించిన వైద్య చికిత్సలను లేదా పద్ధతులను కూడా బైబిలు నిషేధిస్తుంది.—గలతీయులు 5:19-21.

అయితే చాలా రకాలైన వైద్య చికిత్సలు బైబిలు సూత్రాలకు విరుద్ధమైనవి కావు. అందుకే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. ఒక యెహోవాసాక్షి ఫలానా వైద్య చికిత్సను అంగీకరించే అవకాశం ఉంది, కానీ అదే చికిత్సను మరో సాక్షి తిరస్కరించే అవకాశం ఉంది.—గలతీయులు 6:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి