కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 134
  • దెబ్బకు దెబ్బ సమాధానం కాదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దెబ్బకు దెబ్బ సమాధానం కాదు
  • అదనపు అంశాలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు ఏం చెప్పాడు?
  • యేసు ఏం చేశాడు? త్వరలో ఏం చేస్తాడు?
  • ప్రపంచ శాంతి త్వరలో రాబోతుంది
    అదనపు అంశాలు
  • బంగారు సూత్రం అంటే ఏంటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మేలుచేస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • అత్యంత ప్రఖ్యాతిగాంచిన ప్రసంగము
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 134
యేసు అందరికీ అంటే స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు బోధిస్తున్నాడు.

యేసును చూసి నేర్చుకోండి

దెబ్బకు దెబ్బ సమాధానం కాదు

గొడవల్ని ఆపాలన్నా, సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా దెబ్బకు దెబ్బ తీయడమే కరెక్ట్‌ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అలాంటి ఆలోచన యేసుక్రీస్తు చెప్పినదానికి, చేసినదానికి పూర్తి వ్యతిరేకం. మరి యేసు ఏం చెప్పాడు, ఏం చేశాడు? ఇప్పుడు చూద్దాం.

యేసు ఏం చెప్పాడు?

గొడవలు ఆగాలంటే కోపం, ఆవేశం, హింస పనిచేయవని యేసు కొండమీది ప్రసంగంలో చెప్పాడు. ఆయన చెప్పిన కొన్ని సలహాలు చూడండి.

  • “ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.” (మత్తయి 7:12; లూకా 6:31) ఈ సలహాను బంగారు సూత్రంa అని కూడా పిలుస్తారు. వేరేవాళ్లు మనతో ఎలా ఉండాలని మనం అనుకుంటామో, మనం కూడా వాళ్లతో అలానే ఉండాలని యేసు ప్రోత్సహిస్తున్నాడు. ఇతరులు మనల్ని హింసించాలని కోరుకోం కాబట్టి మనం ప్రతీఒక్కరితో, చివరికి మన అభిప్రాయాలు కలవని వాళ్లతో కూడా గౌరవంగా, దయగా ఉండాలి.

  • “మిమ్మల్ని ఒక చెంప మీద కొట్టే వాళ్లకు ఇంకో చెంప కూడా చూపించండి.” (మత్తయి 5:38, 39; లూకా 6:29) ఇతరుల్ని అడిగి మరీ కొట్టించుకోమని యేసు చెప్పట్లేదు. ఆయన కాలంలో కొంతమంది మతనాయకులు పగ తీర్చుకోవడం సరైనదేనని నూరిపోసేవాళ్లు. ఆ తప్పుడు ఆలోచనను యేసు సరిచేయాలని అనుకున్నాడు. ఎవరైనా రెచ్చగొడితే పగ తీర్చుకోవడం కాదుగానీ సౌమ్యంగా, మృదువుగా ఉండాలని యేసు తన శిష్యులకు చెప్తున్నాడు.b

  • “మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి.” (మత్తయి 5:43, 44; లూకా 6:27) మనల్ని ద్వేషించేవాళ్లతో, మనకు అన్యాయం చేసినవాళ్లతో దయగా ఉండాలని యేసు నేర్పించాడు. అంటే వాళ్లు చేస్తున్న చెడును చూసీచూడనట్టు వదిలేస్తున్నామనో, దాన్ని ఒప్పుకుంటున్నామనో కాదు.c మనల్ని ద్వేషించేవాళ్ల మీద దయ చూపిస్తూ ఉంటే వాళ్ల కోపం చల్లారవచ్చు, వాళ్లు తిరిగి మనతో కూడా దయగా ఉండేలా వాళ్ల మనసు కరగవచ్చు.

యేసు ఏం చేశాడు? త్వరలో ఏం చేస్తాడు?

యేసు ఏం చెప్పాడో అదే చేశాడు, దెబ్బకు దెబ్బ సమాధానం కాదని ఆయన తన పనుల్లో చూపించాడు. యేసును బంధించిన రాత్రి ఆయన శిష్యుల్లో ఒకరు ఆయన్ని కాపాడడానికి కత్తి తీసినప్పుడు యేసు ఇలా అన్నాడు: “నీ కత్తిని తిరిగి ఒరలో పెట్టు. కత్తి పట్టుకున్న వాళ్లందరూ కత్తితోనే నాశనమౌతారు.” (మత్తయి 26:52) యేసు తన శత్రువుల్ని ఎంతగా ప్రేమించాడంటే, ఆయన్ని హింసించిన వాళ్లను క్షమించాడు; ఆఖరికి వాళ్ల కోసం ప్రార్థన కూడా చేశాడు!—లూకా 23:33, 34; 1 పేతురు 2:23.

శాంతికి అధిపతైన యేసు త్వరలోనే అన్నిరకాల హింసలకు ముగింపు పలుకుతాడని బైబిలు మాటిస్తుంది. (యెషయా 9:6, 7) ఆ బంగారు భవిష్యత్తు గురించి ఎక్కువ తెలుసుకోవడానికి “యుద్ధాలు, దాడులు లేని ప్రపంచం ఎలా సాధ్యం?” అనే ఆర్టికల్‌ చదవండి.

a ఎక్కువ తెలుసుకోవడానికి “బంగారు సూత్రం అంటే ఏంటి?” అనే ఆర్టికల్‌ చదవండి.

b ఎక్కువ తెలుసుకోవడానికి “‘కంటికి కన్ను’ అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చదవండి.

c ఎక్కువ తెలుసుకోవడానికి “‘శత్రువుల్ని ప్రేమించడం’ అంటే ఏంటి?” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్‌ చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి