అప్రమత్తంగా ఉండండి!
కాలం ఎటు సాగినా సంతోషం మీ వెంటే రావాలంటే ఏం చేయాలి?—బైబిలు ఏం చెప్తుంది?
ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని ఈ కాలంలో, ఏవీ మన చేతుల్లో ఉండట్లేదు. కానీ సంతోషంగా ఉండడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అది మన పరిస్థితుల్ని బట్టి కాదు, మనల్ని బట్టే ఉంటుంది. ఏ చీకు, చికాకు వచ్చినా “సంతోష హృదయం గలవాడికి ప్రతీరోజు విందే” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 15:15) మరి, సంతోషం మన వెంటే ఉండాలంటే ఏం చేయాలి? బైబిలు ఏ చిట్కాలు ఇస్తుందో చూడండి.
ఆందోళనకు నో చెప్పండి
బైబిలు ఇలా చెప్తుంది: “హృదయంలో ఉన్న ఆందోళన దాన్ని కృంగదీస్తుంది, మంచి మాట దాన్ని సంతోషపెడుతుంది.”—సామెతలు 12:25.
అతిగా ఆందోళన పడకుండా ఉండడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది. అదెలాగో తెలుసుకోవడానికి, “కంగారు గురించి పవిత్ర పుస్తకాల్లో ఏముంది” అనే ఆర్టికల్ చదవండి.
ఒంటరితనానికి గుడ్‌బై చెప్పండి
బైబిలు ఇలా చెప్తుంది: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామెతలు 17:17.
స్నేహాలకు హాయ్ చెప్తూ, ఒంటరితనానికి గుడ్‌బై చెప్పడానికి బైబిలు సలహాలు మీకు సహాయం చేస్తాయి. “ఫ్రెండ్స్‌తో ఒంటరితనానికి చెక్ పెట్టండి—బైబిలు ఎలా సహాయం చేస్తుంది” అనే ఆర్టికల్ చదవండి.
దేవుని మీద, సాటిమనిషి మీద ప్రేమజల్లు కురిపించండి
బైబిలు ఇలా చెప్తుంది: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి. . . . నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి.”a—మత్తయి 22:37-39.
దేవుని మీద ప్రేమ పెంచుకోవడానికి ప్రార్థన మనకు ఉపయోగపడుతుంది. ఎక్కువ తెలుసుకోవడానికి, “దేవుడు మన ప్రార్థనల్ని వింటాడా?” అనే ఆర్టికల్ చదవండి.
బంగారు సూత్రంగా ఫేమస్ అయిన ఒక సలహాను పాటిస్తూ, మేము వేరేవాళ్ల మీద ప్రేమ చూపిస్తాం. “బంగారు సూత్రం అంటే ఏంటి?” అనే ఆర్టికల్‌లో ఎక్కువ తెలుసుకోండి.
ఎప్పుడు ఏమౌతుందో తెలియని ఈ కాలంలో సంతోషంగా ఉండడానికి బైబిలు మీకు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోండి. దానికోసం మా ఉచిత బైబిలు కోర్సును ప్రయత్నించి చూడండి.
a యెహోవా అనేది దేవుని పేరు. కీర్తన 83:18.