panitan/stock.adobe.com
యేసు పేదరికానికి ముగింపు పలుకుతాడు
యేసు భూమ్మీద ఉన్నప్పుడు, ప్రజల మీద ముఖ్యంగా పేదవాళ్ల మీద, అణచివేయబడినవాళ్ల మీద చాలా ప్రేమ చూపించాడు. (మత్తయి 9:36) అందరూ ప్రయోజనం పొందేలా తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. (మత్తయి 20:28; యోహాను 15:13) త్వరలో, దేవుని రాజ్యానికి రాజుగా ఆయన తన అధికారాన్ని, శక్తిని ఉపయోగించి భూమ్మీద ఉన్న పేదరికాన్ని పూర్తిగా తీసేస్తాడు. అలా ప్రజల మీద తనకు ఎంత ప్రేమ ఉందో మళ్లీ చూపిస్తాడు.
యేసు ఏం చేస్తాడో వివరిస్తూ బైబిలు ఈ చక్కని మాటల్ని చెప్తుంది:
“ప్రజల్లో దీనులకు ఆయన న్యాయం చేయాలి, పేదవాళ్ల పిల్లల్ని కాపాడాలి.”—కీర్తన 72:4.
యేసు ఇప్పటివరకు మన కోసం చేసినవాటికి, ఇకపై చేయబోయే వాటికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు? ఒక మార్గం ఏంటంటే, ఆయన ప్రకటించిన “దేవుని రాజ్యం గురించిన మంచివార్త” గురించి ఇంకా తెలుసుకోవడం. (లూకా 4:43) “దేవుని ప్రభుత్వం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చదవండి.