AspctStyle/stock.adobe.com
యేసు—యుద్ధం అనే మాటే వినబడకుండా చేస్తాడు
యేసు భూమ్మీద ఉన్నప్పుడు, తనకు ప్రజల మీద చాలా ప్రేమ ఉందని చూపించాడు. ఎంతంటే, వాళ్ల కోసం తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. (మత్తయి 20:28; యోహాను 15:13) ముందుముందు, ప్రజల మీద తనకు ప్రేమ ఉందని మళ్లీ చూపిస్తాడు. ఎలా? దేవుని రాజ్యానికి రాజుగా తనకున్న అధికారంతో, “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు.”—కీర్తన 46:9.
యేసు ఏమి చేస్తాడని బైబిలు చెప్తుందో గమనించండి:
“సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను, దీనుల్ని, నిస్సహాయుల్ని ఆయన రక్షిస్తాడు. దీనుల మీద, పేదవాళ్ల మీద ఆయన జాలి చూపిస్తాడు, పేదవాళ్ల ప్రాణాల్ని కాపాడతాడు. అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్తన 72:12-14.
ఇప్పటివరకు యేసు మనకోసం చేసినవాటి మీద, ముందుముందు చేయబోయేవాటి మీద కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు? ఒక మార్గం ఏంటంటే, ఆయన ప్రకటించిన “దేవుని రాజ్యం గురించిన మంచివార్త” గురించి ఇంకా తెలుసుకోవడం. (లూకా 4:43) “దేవుని ప్రభుత్వం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చదవండి.