కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 నవంబరు పేజీలు 8-9
  • నేను డ్రైవింగ్‌ చేయడం ఆపేయాలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను డ్రైవింగ్‌ చేయడం ఆపేయాలా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ డ్రైవింగ్‌ని అంచనా వేసుకోండి
  • బైబిలు సూత్రాలను మనసులో ఉంచుకోండి
  • మోటారు వాహనాల దుర్ఘటనలు మీరు సురక్షితంగా ఉన్నారా?
    తేజరిల్లు!—2002
  • మీరు సురక్షితంగా డ్రైవ్‌ చేస్తారా?
    తేజరిల్లు!—1995
  • వికలాంగున్ని—అయినా వాహనం నడిపేందుకు సమర్థున్ని
    తేజరిల్లు!—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 నవంబరు పేజీలు 8-9
ఒక పెద్దవయసు బ్రదర్‌ కిటికీ పక్కన కూర్చొని, తన కారును చూస్తున్నాడు. తన చేతిలో కారు తాళాలు పట్టుకొని, దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

నేను డ్రైవింగ్‌ చేయడం ఆపేయాలా?

మీరు చాలా ఏళ్లుగా బండి నడుపుతున్నారు. చేతిలో బండి ఉంటే మీకు ఇష్టమైన చోటుకు, ఇష్టమైనప్పుడు స్వేచ్ఛగా తిరగొచ్చు. కానీ ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మీరు డ్రైవింగ్‌ ఆపేయాలని చెప్తున్నారు. కానీ వాళ్లు ఎందుకలా కంగారుపడుతున్నారో మీకు అర్థం కావట్లేదు.

మీ ఇంట్లో కూడా ఇదే గోలా? అయితే, మీరు డ్రైవింగ్‌ చేయాలా ఆపేయాలా అనేది దేన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు?

కొన్ని దేశాల్లో ఓ వయసు దాటిన తర్వాత, డ్రైవింగ్‌ లైసెన్స్‌ని రెన్యువల్‌ చేసుకోవాలంటే డాక్టర్‌ సర్టిఫికెట్‌ కావాలి. ఆ దేశాల్లో ఉంటున్న క్రైస్తవులు ఆ నియమాలకు లోబడతారు. (రోమా. 13:1) కానీ మీరు ఎక్కడున్నా మీరు డ్రైవింగ్‌ బాగా చేయగలుగుతారో లేదో మీరే ఒక అంచనా వేసుకోవచ్చు.

మీ డ్రైవింగ్‌ని అంచనా వేసుకోండి

మీ డ్రైవింగ్‌ని అంచనా వేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రశ్నలను వేసుకోమని అమెరికాలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ ఏజింగ్‌ (NIA) అనే వెబ్‌సైట్‌ చెప్తుంది.

  • నాకు రోడ్డు మీద ఉన్న సైన్‌ బోర్డులు స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా రాత్రిపూట నాకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయా?

  • కారు అద్దాల్ని చూడ్డానికి అలాగే అద్దంలో కనపడని చోట్లు చూడ్డానికి నా తలను తిప్పగలుగుతున్నానా?

  • నేను ఇంకా చురుగ్గానే ఉన్నానా, అంటే నేను నా కాళ్లతో యాక్సిలేటర్‌ను, బ్రేక్‌ను వెంటవెంటనే తొక్కగలుగుతున్నానా?

  • నేను ట్రాఫిక్‌కి ఇబ్బంది కలిగేలా మరీ నెమ్మదిగా నడుపుతున్నానా?

  • ఈ మధ్య నాకు ఎప్పుడైనా ప్రమాదం తృటిలో తప్పిందా, లేదా దేన్నైనా గుద్దేయడం వల్ల నా బండికి సొట్టలు-గీతలు పడ్డాయా?

  • నా డ్రైవింగ్‌ వల్ల పోలీసులు ఎప్పుడైనా ఆపారా?

  • నేను కారు నడుపుతూ ఎప్పుడైనా నిద్రలోకి జారుకున్నానా?

  • నేను వాడే మందుల వల్ల డ్రైవింగ్‌ చేయడం కష్టమా?

  • నా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు నా డ్రైవింగ్‌ గురించి కంగారు పడుతున్నారా?

ఆ ప్రశ్నల్లో ఒకటి లేదా రెండిటికి మీ సమాధానం అవును అయితే, మీరు కొన్ని మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. ఉదాహరణకు, మీరు డ్రైవింగ్‌ చేయడాన్ని తగ్గించవచ్చు, ముఖ్యంగా రాత్రిపూట నడపడాన్ని తగ్గించవచ్చు. ఎప్పటికప్పుడు మీరు డ్రైవింగ్‌ ఎలా చేస్తున్నారో చూసుకుంటూ ఉండండి. మీరు కావాలనుకుంటే, మీ డ్రైవింగ్‌ ఎలా ఉందో ఒక కుటుంబ సభ్యుణ్ణి గానీ, స్నేహితుణ్ణి గానీ అడిగి తెలుసుకోండి. అవసరం అనుకుంటే, సురక్షితంగా డ్రైవింగ్‌ ఎలా చేయాలో నేర్పించే కోర్సులో చేరండి. ఒకవేళ, పైన ప్రశ్నల్లో చాలా వాటికి మీ జవాబు అవును అయితే, బహుశా మీరు డ్రైవింగ్‌ ఆపేయడమే మంచిదేమో ఆలోచించండి.a

బైబిలు సూత్రాలను మనసులో ఉంచుకోండి

మనకు తెలియకుండానే రోజురోజుకు డ్రైవింగ్‌ చేసే మన సామర్థ్యం తగ్గిపోతూ ఉండొచ్చు. అలాగే కారు నడపడం ఆపేయాలనే విషయం మనకు మింగుడు పడకపోవచ్చు. అయితే, ఈ విషయంలో మనం సరిగ్గా ఆలోచించేలా, తెలివైన నిర్ణయం తీసుకునేలా ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి? ఇప్పుడు రెండిటిని చూద్దాం.

అణకువతో ఉండండి. (సామె. 11:2) మన వయసు పైబడే కొద్దీ కంటి చూపు తగ్గుతుంది, చెవులు సరిగ్గా వినబడవు, కాళ్లుచేతుల్లో ఇంతకుముందులా పట్టుండదు, చకాచకా తిరగడానికి శరీరం సహకరించదు. ఉదాహరణకు, చాలామంది ఒక వయసు వచ్చిన తర్వాత, కొన్ని రకాల ఆటలు ఆడడం ఆపేస్తారు. ఎందుకంటే ఈ వయసులో అవి ఆడితే, వాళ్లకు ఈజీగా దెబ్బలు తగులుతాయి. అదే సూత్రం డ్రైవింగ్‌కు కూడా వర్తిస్తుంది. అందుకే అణకువ ఉన్న వ్యక్తి, తన భద్రతను దృష్టిలో ఉంచుకొని, తన జీవితంలో ఏదోక సమయంలో డ్రైవింగ్‌ ఆపేయాలని నిర్ణయించుకోవచ్చు. (సామె. 22:3) అలాగే డ్రైవింగ్‌ చేయొద్దని ఎవరైనా చెప్పినప్పుడు, అణకువ ఉన్న వ్యక్తి దానికి చక్కగా స్పందిస్తాడు, చెప్పింది వింటాడు.—2 సమూయేలు 21:15-17 తో పోల్చండి.

రక్తాపరాధాన్ని మూట కట్టుకోకండి. (ద్వితీ. 22:8) సరిగ్గా నడపకపోతే కారే మనుషుల్ని చంపే ఒక ఆయుధంగా మారిపోవచ్చు. కారు నడిపే సామర్థ్యం తగ్గిపోతున్నా సరే, ఒకవ్యక్తి దాన్ని పట్టించుకోకుండా నడుపుతూ ఉంటే ఆయన తన ప్రాణాన్నే కాదు ఇతరుల ప్రాణాల్ని కూడా ప్రమాదంలో పడేస్తాడు. అలాగే తనవల్ల ఏదైనా పెద్ద యాక్సిడెంట్‌ జరిగితే, ఆ రక్తాపరాధం తనమీద ఉంటుంది.

ఇప్పుడు డ్రైవింగ్‌ చేయాలా వద్దా అనే కష్టమైన నిర్ణయం మీ ముందుందా? అయితే డ్రైవింగ్‌ ఆపేస్తే మీ విలువ, గౌరవం తగ్గిపోతాయని అనుకోకండి. మీలో ఉన్న అణకువ, వినయం, ఇతరుల్ని పట్టించుకోవడం లాంటి మంచిమంచి లక్షణాల్ని యెహోవా ఇష్టపడతాడు. ఆయన మిమ్మల్ని చూసుకుంటానని, మిమ్మల్ని ఓదారుస్తానని మాటిస్తున్నాడు. (యెష. 46:4) ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదిలేయడు. కాబట్టి వివేచనను, బైబిల్లో ఉన్న తెలివిని ఉపయోగించి డ్రైవింగ్‌ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకునేలా సహాయం చేయమని యెహోవానే అడగండి.

వేరేవాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?

డ్రైవింగ్‌ గురించి వయసు పైబడిన వాళ్లతో ఎక్కువ శాతం కుటుంబ సభ్యులే మాట్లాడితే బాగుంటుంది. లేదా డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి మీ స్నేహితుడైతే, అతని డ్రైవింగ్‌ గురించి ఇతరులు చెప్పేవాటిని కొట్టి పారేయకండి. కావాలంటే అతనితోపాటు మీరూ వెళ్లి, అతని డ్రైవింగ్‌ ఎలా ఉందో చూడండి. అవసరమైతే, అతని డ్రైవింగ్‌ గురించి అతనితో మాట్లాడండి. అయితే, అలా మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు వాళ్ల స్థానంలో పెట్టుకుని ఆలోచించండి. నిజాయితీగా ఉంటూనే దయగా మాట్లాడండి. మనం మాట్లాడాలనుకుంటుంది అతని డ్రైవింగ్‌ గురించే గానీ, అతని వయసు గురించి కాదు. కాబట్టి అతనితో “మీ భద్రత గురించే నా కంగారంతా” అని అనండే గానీ, “మీరు బండి నడపడానికి పనికిరారు“ అని అనకండి. అలాగే ఈ ఆర్టికల్‌లో ఉన్న బైబిలు సూత్రాల్ని అతనికి చూపించి, అవి పాటించడం ఎంత ముఖ్యమో గుర్తుచేయండి.

ఒక పెద్దవయసు వ్యక్తి డ్రైవింగ్‌ మానేయాలని నిర్ణయించుకుంటే, అతనికి ఎలా అనిపిస్తుందో మనమందరం అర్థంచేసుకోవాలి. అతనికి స్వేచ్ఛ పోయినట్టు, పక్కన వాళ్లకు భారంగా తయారౌతున్నట్టు అనిపించవచ్చు. మరి, మీరెలా సహాయం చేయవచ్చు? వాళ్లకు ఆసరాగా ఉండండి, అవసరమైన సహాయం చేయండి. (సామె. 17:17) వాళ్లే వచ్చి అడిగేదాక ఆగకండి. బహుశా వాళ్లు మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెడుతున్నామని మొహమాట పడుతుండవచ్చు. బదులుగా వాళ్లను మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి, షాపింగ్‌కి అలాగే హాస్పిటల్‌కి తీసుకెళ్లేలా మీరే ఒక ప్రణాళిక వేసుకోండి. వాళ్లకు ఇలా సహాయం చేయడం, వాళ్లతో టైం గడపడం మీకు ఇష్టమని భరోసా ఇవ్వండి.—రోమా. 1:11, 12.

a మరింత సమాచారం కోసం ఆగస్టు 22, 2002, తేజరిల్లు! పత్రికలో, “మోటారు వాహనాల దుర్ఘటనలు మీరు సురక్షితంగా ఉన్నారా?” అనే ఆర్టికల్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి