కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మార్చి పేజీ 13
  • ప్రతీ సమస్యకు ఒక ముగింపు ఉంటుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రతీ సమస్యకు ఒక ముగింపు ఉంటుంది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • కష్టాల్లో యెహోవా మనకు సహాయం చేస్తాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఓర్పు చూపిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • యెహోవా చర్య తీసుకునేంత వరకు ఓర్పుగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మీరు ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మార్చి పేజీ 13
చిత్రాలు: “ఐక్యతలేని లోకంలో కలిసివున్న ప్రజలు” వీడియోలోని ఒక సన్నివేశం. 1. సమావేశంలో నల్ల జాతి సహోదరసహోదరీలు మాత్రమే ఉన్నారు. 2. నల్ల జాతి, తెల్ల జాతి సంఘపెద్దలు కలిసి వాళ్ల భార్యలతో ఫోటో దిగుతున్నారు. 3. వేర్వేరు వయసులకు, దేశాలకు చెందిన ఇద్దరు సహోదరీలు బహిరంగ సాక్ష్యం చేస్తున్నారు.

మన క్రైస్తవ జీవితం

ప్రతీ సమస్యకు ఒక ముగింపు ఉంటుంది

సమస్యలు మన ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. ముఖ్యంగా, ఏదైనా సమస్య చాలాకాలంగా వెంటాడుతుంటే ఇంకా ఎక్కువ నిరుత్సాహంగా అనిపిస్తుంది. దావీదు విషయాన్నే తీసుకుంటే, రాజైన సౌలు వల్ల తాను పడుతున్న ఇబ్బందులన్నీ ఏదోకరోజు ముగింపుకు వస్తాయని, యెహోవా మాటిచ్చినట్లు తాను రాజు అవుతానని ఆయనకు తెలుసు. (1స 16:13) దావీదుకు విశ్వాసం ఉండడం వల్ల, యెహోవా చర్య తీసుకునేంత వరకు ఆయన ఓర్పుగా ఎదురుచూశాడు.

మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వివేకాన్ని, జ్ఞానాన్ని, ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి దాన్నుండి బయటపడడానికి ప్రయత్నిస్తాం. (1స 21:12-14; సామె 1:4) అయితే, బైబిలు సూత్రాల ప్రకారం మనం చేయగలిగినదంతా చేశాక కూడా కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటప్పుడే మనం యెహోవా చర్య తీసుకునేంతవరకు ఓపిగ్గా ఎదురుచూడాలి. అతి త్వరలో ఆయన మన సమస్యలన్నిటినీ ముగింపుకు తెస్తాడు, “ప్రతి కన్నీటి బొట్టు తుడిచేస్తాడు.” (ప్రక 21:4) మన సమస్యకు పరిష్కారం యెహోవా వల్ల దొరికినా లేదా వేరే కారణం వల్ల దొరికినా ఒకటి మాత్రం వాస్తవం, ప్రతీ సమస్యకు ఒక ముగింపు ఉంటుంది. ఇది ఊరటను ఇచ్చే విషయం కదా!

ఐక్యతలేని లోకంలో కలిసివున్న ప్రజలు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది క్రైస్తవులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు?

  • వాళ్లు ఓర్పును, ప్రేమను ఎలా చూపించారు?

  • వాళ్లు ‘ఎక్కువ ప్రాముఖ్యమైన’ వాటిమీద ఎలా మనసుపెట్టారు?—ఫిలి 1:10

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి