“క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది.” —2కొ 5:14
మన క్రైస్తవ జీవితం
మార్చి లేదా ఏప్రిల్ నెలలో మీరు సహాయ పయినీరు సేవ చేస్తారా?
మీరు జ్ఞాపకార్థ ఆచరణ నెలల్లో పరిచర్య ఎక్కువ చేయాలనుకుంటున్నారా? (2కొ 5:14, 15) మార్చి, ఏప్రిల్ నెలల్లో సహాయ పయినీరు సేవచేసేవాళ్లు పరిచర్యను 30 గంటలు గానీ, 50 గంటలు గానీ చేయవచ్చు. మీరు ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే, అప్లికేషన్ నింపి మీ సంఘ సేవా కమిటీకి ఇవ్వండి. సహాయ పయినీర్లుగా సేవచేసే ప్రచారకుల పేర్లను ప్రతీనెల సంఘంలో ప్రకటన చేస్తారు. దానివల్ల, పయినీర్లు తమ గంటల్ని పూర్తి చేసేలా సంఘంలోని ఇతరులు సహాయం చేయగలుగుతారు. పరిచర్యలో మన నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడానికి, ఒకర్నొకరు ప్రోత్సహించుకోవడానికి జ్ఞాపకార్థ ఆచరణ కాలం చక్కని అవకాశాన్నిస్తుంది. కాబట్టి మనందరం దాన్ని ఉపయోగించుకుని ప్రయోజనం పొందుదాం!—1థె 5:11.