కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 5
  • మీ వివాహబంధాన్ని కాపాడుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ వివాహబంధాన్ని కాపాడుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవులు తమ వివాహబంధాన్ని ఎలా సంతోషమయం చేసుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఒకవేళ వివాహం విచ్ఛిన్నం కాబోయే స్థితిలో ఉంటే
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • పెళ్లి తర్వాత జీవితం
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • వివాహ జీవితంలో ఆనందాన్ని అనుభవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 5
ఒక భర్త కింద కూర్చొని తన భార్యతో కలిసి సంతోషంగా బట్టలు ఉతుకుతున్నాడు.

మన క్రైస్తవ జీవితం

మీ వివాహబంధాన్ని కాపాడుకోండి

యెహోవా పెళ్లి ప్రమాణాల్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడు. భార్యాభర్తలు ఒకరినొకరు అంటిపెట్టుకొని ఉండాలని ఆయన చెప్పాడు. (మత్త 19:5, 6) దేవుని ప్రజల్లో సంతోషంగా ఉండే దంపతులు ఎంతోమంది ఉన్నారు. అయితే, భార్యాభర్తలు పరిపూర్ణులు కారు. కాబట్టి వాళ్లమధ్య అభిప్రాయభేదాలు వస్తాయి. అలాంటప్పుడు వేరైపోవడం, విడాకులు తీసుకోవడం మాత్రమే ఏకైక పరిష్కారమని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఆ ఆలోచన తప్పు. భార్యాభర్తలు తమ వివాహబంధాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

అందుకోసం ఐదు ముఖ్యమైన పనులు చేయాలి.

  1. వివాహబంధాన్ని బలహీనపర్చే వాటికి దూరంగా ఉండడం ద్వారా మీ హృదయాన్ని కాపాడుకోండి. ఉదాహరణకు ఇతరులతో సరసాలాడడం, అనైతిక వినోదాన్ని చూడడం వంటివి చేయకండి.—మత్త 5:28; 2పే 2:14.

  2. దేవునితో మీకున్న స్నేహాన్ని బలపర్చుకోండి, భార్యాభర్తలుగా యెహోవాను సంతోషపెట్టాలనే కోరికను పెంచుకోండి.—కీర్త 97:10.

  3. కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకుంటూ ఉండండి; దయతో చిన్నచిన్న సహాయాలు చేస్తూ మీ వివాహజత పనుల్ని తేలిక చేయండి.—కొలొ 3:8-10, 12-14.

  4. ఒకరితోఒకరు ప్రతీరోజు గౌరవంగా, దాపరికం లేకుండా మాట్లాడుకోండి.—కొలొ 4:6.

  5. ఒకరి అవసరాల్ని మరొకరు ఆప్యాయంగా, ప్రేమగా తీర్చుకోండి.—1కొ 7:3, 4; 10:24.

క్రైస్తవులు వివాహబంధాన్ని ఘనమైనదిగా ఎంచడం ద్వారా వివాహాన్ని ఏర్పాటు చేసిన యెహోవాను ఘనపరుస్తారు.

‘ఓపిగ్గా పరుగెత్తండి’—పోటీలోని నియమాల్ని పాటిస్తూ వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘ఓపిగ్గా పరుగెత్తండి’​—⁠పోటీలోని నియమాల్ని పాటిస్తూ వీడియోలో ఒక సన్నివేశం. రాజ్యమందిరంలో తమ వివాహ ప్రసంగం తర్వాత చిరునవ్వు చిందిస్తున్న బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ కార్తిక్‌.

    పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉన్నా, కాలం గడిచేకొద్దీ ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు?

  • ‘ఓపిగ్గా పరుగెత్తండి’​—⁠పోటీలోని నియమాల్ని పాటిస్తూ వీడియోలో ఒక సన్నివేశం. కార్తిక్‌ దంపతులు తమ సమస్యల గురించి ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు. టేబుల్‌ మీద బైబిలు తెరిచివుంది.

    తమ మధ్య ప్రేమ లేదని అనుకునే భార్యాభర్తలకు బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేయగలవు?

  • ‘ఓపిగ్గా పరుగెత్తండి’​—⁠పోటీలోని నియమాల్ని పాటిస్తూ వీడియోలో ఒక సన్నివేశం. కార్తిక్‌ తన భార్యకు, ఇద్దరు కూతుళ్లకు ‘నా బైబిలు కథల పుస్తకము’ చదివి వినిపిస్తున్నాడు.

    బైబిలు సూత్రాలు పాటిస్తే వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది

    భార్యాభర్తల నుండి యెహోవా ఏమి కోరుకుంటున్నాడు?

  • వివాహ జీవితం సంతోషంగా ఉండాలంటే, భార్యాభర్తలిద్దరూ ఏం చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి