మన క్రైస్తవ జీవితం
వినయంగా ఉండండి—గొప్పలు చెప్పుకోకండి
గొప్పలు చెప్పుకోవడం, మనల్ని మనం పొగుడుకోవడం మనలో గర్వం ఉందని చూపిస్తాయి. అంతేకాదు అలా మాట్లాడడం వినేవాళ్లకు ప్రోత్సాహకరంగా ఉండదు. అందుకే బైబిలు ఇలా చెప్తుంది: “నీ నోరు కాదు వేరేవాళ్లే నిన్ను పొగడాలి; నీ పెదాలు కాదు ఇతరులే నిన్ను కీర్తించాలి.”—సామె 27:2.
యెహోవా స్నేహితులవ్వండి—గొప్పలు చెప్పుకోకండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
సాధారణంగా ప్రజలు ఎలాంటి విషయాల గురించి గొప్పలు చెప్పుకుంటారు?
నిఖిల్ తన ఫ్రెండ్‌తో దేని గురించి గొప్పలు చెప్పుకున్నాడు?
నిఖిల్ వాళ్ల నాన్న అతనికి ఎలా సహాయం చేశాడు?
మనం వినయంగా ఉండడానికి 1 పేతురు 5:5 ఎలా సహాయం చేయగలదు?