దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 8-9
గర్విష్ఠి అయిన ఫరో తనకు తెలీకుండానే దేవుని సంకల్పానికి ఉపయోగపడ్డాడు
ఐగుప్తును పాలించే ఫరోలు తమను దేవుళ్లుగా భావించుకునేవాళ్లు. ఫరో మోషే అహరోనుల మాట, ఆఖరికి ఇంద్రజాలం చేసే తన సొంత పూజారుల మాట వినడానికి ఎందుకు గర్వంగా నిరాకరించాడో దీన్నిబట్టి అర్థమౌతుంది.
వేరేవాళ్లు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు మీరు వింటారా? మీరు మెరుగుపర్చుకోవాల్సిన ఒక విషయాన్ని ఎవరైనా చెప్తే మీరు సంతోషిస్తారా? లేదా మీరు చేసేదే సరైనదని అనుకుంటారా? “నాశనానికి ముందు గర్వం ఉంటుంది.” (సామె 16:18) కాబట్టి గర్వం మనలో మొలకెత్తకుండా చూసుకోవడం ఎంతో ప్రాముఖ్యం!