దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 6-7
“నేను ఫరోకు ఏం చేస్తానో ఇప్పుడు నువ్వు చూస్తావు”
ఐగుప్తు మీదకు తెగుళ్లు తీసుకొచ్చే ముందు, ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుండి విడిపించే ముందు యెహోవా తాను చేయబోయే వాటిని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. వాళ్లు ముందెన్నడూ చూడని విధాల్లో యెహోవా శక్తిని చూస్తారని, యెహోవా ఎవరో ఐగుప్తీయులు ఖచ్చితంగా తెలుసుకుంటారని ఆయన చెప్పాడు. దేవుడు చెప్పినట్టే జరిగినప్పుడు ఇశ్రాయేలీయుల విశ్వాసం బలపడింది. దానివల్ల, వాళ్లు అప్పటివరకు ఐగుప్తులో ఎదుర్కొన్న అబద్ధమత ప్రభావాలను తిప్పికొట్టగలిగారు.
భవిష్యత్తు గురించి దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరతాయనే మీ విశ్వాసాన్ని ఈ బైబిలు వృత్తాంతం ఎలా బలపరుస్తుంది?