జూలై 13-19
నిర్గమకాండం 8-9
పాట 12, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“గర్విష్ఠి అయిన ఫరో తనకు తెలీకుండానే దేవుని సంకల్పానికి ఉపయోగపడ్డాడు”: (10 నిమి.)
నిర్గ 8:15—ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని, మోషే అహరోనుల మాట వినడానికి ఇష్టపడలేదు (it-2-E 1040-1041)
నిర్గ 8:18, 19—ఇంద్రజాలం చేసే తన సొంత పూజారులు ఓటమిని అంగీకరించినా ఫరో మాత్రం మొండిగానే ఉన్నాడు
నిర్గ 9:15-17—ఫరోను ప్రాణాలతో ఉండనివ్వడం ద్వారా యెహోవా తన పేరును మహిమపర్చుకున్నాడు (it-2-E 1181వ పేజీ, 3-5 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 8:21—జోరీగ అంటే ఏంటి? (it-1-E 878)
నిర్గ 8:25-27—ఇశ్రాయేలీయులు అర్పించబోయే బలులు “ఐగుప్తీయులకు అసహ్యమైనవి” అని మోషే ఎందుకు అన్నాడు? (w04 3/15 25వ పేజీ, 10వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 8:1-19 (12)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: ఇంటివ్యక్తి అభ్యంతరం చెప్పినప్పుడు సహోదరుడు ఎలా స్పందించాడు? మీరైతే బోధనా పనిముట్లలోని ఒక ప్రచురణను ఎలా పరిచయం చేసివుండేవాళ్లు?
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బైబిలు స్టడీ చేయడానికి ఉపయోగించే ఒక ప్రచురణ ఇవ్వండి. (12)
మన క్రైస్తవ జీవితం
“వినయంగా ఉండండి—గొప్పలు చెప్పుకోకండి”: (7 నిమి.) చర్చ. యెహోవా స్నేహితులవ్వండి—గొప్పలు చెప్పుకోకండి వీడియో చూపించండి. వీలైతే, ముందే ఎంపిక చేసుకున్న కొంతమంది పిల్లల్ని స్టేజీ మీదకు పిలిచి, వీడియో గురించి కొన్ని ప్రశ్నలు అడగండి.
“వేరేవాళ్లు పొగిడినప్పుడు వినయంగా ఉండండి”: (8 నిమి.) చర్చ. యేసులా విశ్వసనీయంగా ఉండండి—మిమ్మల్ని పొగిడినప్పుడు వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 89వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 79, ప్రార్థన