దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 44-45
యోసేపు తన అన్నల్ని క్షమించాడు
ఇతరుల్ని క్షమించడం సవాలుగా ఉండవచ్చు, మరిముఖ్యంగా కావాలనే మనకు హానిచేసిన వాళ్లను క్షమించడం ఇంకా కష్టంగా ఉండవచ్చు. తనకు అన్యాయం చేసిన తన అన్నల్ని క్షమించడానికి యోసేపుకు ఏది సహాయం చేసింది?
యోసేపు పగ తీర్చుకోవాలని చూడలేదు గానీ క్షమించడానికి ఏమైనా ఆధారం దొరుకుతుందేమో చూశాడు.—కీర్త 86:5; లూకా 17:3, 4
అతను మనసులో నుండి కోపాన్ని తీసేసుకున్నాడు, ఉదారంగా క్షమించే యెహోవాను అనుకరించాడు.—మీకా 7:18, 19
నేను యెహోవాలా ఇతరుల్ని ఎలా క్షమించవచ్చు?