మన క్రైస్తవ జీవితం
ప్రత్యేక పాటల నుండి మీరు ఏం నేర్చుకోవచ్చు?
ప్రత్యేక పాటల్లో మీకు ఏవి బాగా ఇష్టం? ఎందుకు ఇష్టం? ఆ వీడియోల్లో రోజువారీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని చూడవచ్చు. ఈ పాటల్ని రకరకాల అంశాలతో, చక్కని సంగీతంతో కూర్చారు. కాబట్టి ప్రతీఒక్కరికి ఏదోక పాట ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ప్రత్యేక పాటలు, వాటికి సంబంధించిన మ్యూజిక్ వీడియోలు కేవలం మన వినోదం కోసమే కాదు.
క్రైస్తవులముగా మన జీవితంలో, మన పరిచర్యలో పాటించగలిగే ఎన్నో చక్కని విషయాలు ఈ ప్రత్యేక పాటల నుండి నేర్చుకోవచ్చు. కొన్ని పాటలు ఆతిథ్యం, ఐక్యత, స్నేహం, ధైర్యం, ప్రేమ, విశ్వాసం వంటి అంశాల గురించి చెప్తాయి. ఇంకొన్ని పాటలు యెహోవా దగ్గరకు తిరిగి రావడం, క్షమించడం, ప్రతీరోజు యథార్థంగా ఉండడం, ఆధ్యాత్మిక లక్ష్యాల్ని చేరుకోవడం గురించి చెప్తాయి. ఫోన్‌లు ఉపయోగించడం గురించి కూడా ఒక పాట ఉంది. ప్రత్యేక పాటల నుండి మీరు ఇంకా ఏం నేర్చుకున్నారు?
యెహోవాయే నా ధైర్యం అనే ప్రత్యేక పాట వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి: