దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 11-16
యెహోవాను గూర్చిన జ్ఞానంతో భూమి నిండిపోతుంది
ఈ ప్రవచనం ఇశ్రాయేలీయుల విషయంలో ఎలా నెరవేరింది
ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి వచ్చేటప్పుడు, తిరిగి వచ్చాక వాగ్దానదేశంలో, క్రూరమృగాలకు, క్రూరులైన మనుషులకు భయపడే పరిస్థితి రాలేదు.—ఎజ్రా 8:21, 22
ఈ ప్రవచనం ఇప్పుడెలా నెరవేరుతుంది
యెహోవా జ్ఞానం మనుషుల్లో మార్పును తెచ్చింది. ఇంతకుముందు క్రూరంగా ఉన్న ప్రజలు ఇప్పుడు శాంతంగా మారారు. దేవుని జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పరదైసును సృష్టించింది
ఈ ప్రవచనం భవిష్యత్తులో ఎలా నెరవేరుతుంది
దేవుడు మొదట ఉద్దేశించినట్లే ఈ భూమంతా సురక్షితంగా, ప్రశాంతంగా ఉండే పరదైసుగా మారుతుంది. ఏ జీవి నుండి ఏ హాని ఉండదు. మనుషుల నుండి, జంతువుల నుండి ఏ హాని కలుగదు
పౌలు దేవుని జ్ఞానం వల్ల మారాడు
పరిసయ్యుడైన సౌలు క్రూరమృగంలా ప్రవర్తించాడు.—1 తిమో 1:12, 13
సరైన జ్ఞానం ఆయనలో మార్పును తెచ్చింది.—కొలొ 3:8-10