మన క్రైస్తవ జీవితం
రాజ్యం—మొదటి 100 సంవత్సరాలు
దేవుని రాజ్యంలో పౌరులు అవ్వాలనుకునే వాళ్లు ఆ రాజ్యం గురించి ఆ రాజ్యం చేసిన వాటన్నిటి గురించి సాధ్యమైనంత ఎక్కువ తెలుసుకోవాలి. ఎందుకు? అది దేవుని రాజ్యం పరిపాలిస్తుందని వాళ్ల విశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాదు, ఆ రాజ్య సువార్తను ఇతరులకు చెప్పడానికి వాళ్ల మనసును కదిలిస్తుంది. (కీర్త 48:12, 13) రాజ్యం—మొదటి 100 సంవత్సరాలు అనే వీడియో చూస్తుండగా ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి:
“ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” చూసిన వాళ్లకు అది ఎలా గొప్ప ఆశీర్వాదంగా ఉంది?
సువార్తను ప్రజలకు చేరవేయడానికి రేడియో ఎలా ఉపయోగపడింది?
సువార్త ప్రకటించడానికి ఏయే పద్ధతులు వాడాము, ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
సంవత్సరాలు గడుస్తుండగా పరిచర్య కోసం శిక్షణ ఎలా మెరుగౌతూ వచ్చింది?
గిలియడ్ పాఠశాల విద్యార్థులకు ఎలాంటి మంచి శిక్షణ ఇచ్చింది?
యెహోవా ప్రజల జ్ఞానం పెంచడానికి సమావేశాలు ఎలా సహాయం చేశాయి?
దేవుని రాజ్యం పరిపాలిస్తుందని మీరు ఎందుకు నమ్ముతున్నారు?
దేవుని రాజ్యానికి మన మద్దతును ఎలా ఇవ్వవచ్చు?