దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 45-51
విరిగిన హృదయం గలవాళ్లను యెహోవా విడిచిపెట్టడు
దావీదు బత్షెబతో చేసిన ఘోరమైన పాపం గురించి నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత దావీదు 51వ కీర్తనను రాశాడు. దావీదు మనస్సాక్షి ఆయనను ఎంతో బాధించింది, చేసిన తప్పును వినయంగా ఒప్పుకున్నాడు.—2 సమూ 12:1-14
దావీదు పాపం చేశాడు, అయితే యెహోవాతో సంబంధాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు
దావీదు పశ్చాత్తాపపడి తప్పును ఒప్పుకోక ముందు, అతని మనస్సాక్షి ఆయనను ఎంతో బాధించింది
దేవుని అంగీకారం పోగొట్టుకున్నందుకు దావీదుకు ఎముకల్ని నలుగగొట్టినంత బాధ కలిగింది
క్షమాపణ కోసం, యెహోవాతో సంబంధాన్ని తిరిగి పొందడం కోసం, అంతకుముందు తనకున్న ఆనందం కోసం ఎంతో ఎదురు చూశాడు
లోబడే హృదయాన్ని ఇవ్వమని వినయంగా యెహోవాను అర్థించాడు
యెహోవా క్షమిస్తాడనే నమ్మకం ఆయనకు ఉంది