దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 16-20 మృదువైన మాటలతో ఇతరులకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వండి ఇతరులను బలపర్చేలా సలహాలు ఇవ్వాలి 16:4, 5 యోబు చాలా బాధపడుతూ వేదనతో ఉన్నాడు కాబట్టి ఆయనకు ధైర్యం చెప్పి ఉపశమనం కలిగించే వాళ్లు కావాలి యోబు ముగ్గురు స్నేహితులు ఆయనను ఓదార్చేలా ఏమీ మాట్లాడలేదు. పైగా నిందలు వేస్తూ ఆయన దుఃఖాన్ని పెంచారు బిల్దదు కఠినంగా అన్న మాటలు యోబు బాధతో ఏడ్చేలా చేశాయి 19:2, 25 యోబు ఆ దుఃఖం నుండి విడుదల కోసం మరణాన్నైన ఇవ్వమని దేవున్ని వేడుకున్నాడు పునరుత్థానం మీద తనకున్న నిరీక్షణ గురించి యోబు ఆలోచిస్తూ నమ్మకంగా తట్టుకున్నాడు