కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/15 పేజీ 1
  • వివేచనతో సువార్త ప్రకటించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వివేచనతో సువార్త ప్రకటించండి
  • మన రాజ్య పరిచర్య—2015
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠కెమెరా లేదా ఇంటర్‌కామ్‌ ద్వారా సాక్ష్యమివ్వడం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • అపార్ట్‌మెంట్‌లలో ప్రకటిస్తూ సమగ్రంగా సాక్ష్యమివ్వండి
    మన రాజ్య పరిచర్య—2013
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • సువార్తనందించుట—సాయంకాల వేళలలో
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2015
km 2/15 పేజీ 1

వివేచనతో సువార్త ప్రకటించండి

1 వేర్వేరు నమ్మకాల, నేపథ్యాల ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వివేచన ఉపయోగించడం ఎంత అవసరమో అపొస్తలుడైన పౌలు నొక్కిచెప్పాడు. ఈ రోజుల్లో కొందరు, దేవుని మీద నమ్మకం ఉందని చెప్పుకుంటారు. ఇంకొందరికి దేవుడన్నా, మతమన్నా ఏమాత్రం ఆసక్తి ఉండదు. అయితే మనం సువార్త ప్రచారకులం కాబట్టి, “అన్ని” రకాల ప్రజలకు నచ్చేలా రాజ్య సందేశాన్ని ప్రకటించాలి. అందుకు వివేచన ఉపయోగించాలి.—1 కొరిం. 9:19-23.

2 పరిచర్యలో, ఇంటివాళ్ల అభిరుచులకు తగినట్లు మన మాటల్ని మలచుకోవాలంటే వివేచన కావాలి. అలా మలచుకోవాలంటే మనం చక్కగా సిద్ధపడాలి. అందుబాటులో ఉన్న పుస్తకాలు, పత్రికల్లోని వివిధ అంశాల గురించి బాగా తెలుసుకొనివుంటే, ప్రజలకు ఎన్నో రకాలుగా సువార్తను పరిచయం చేయవచ్చు. వృద్ధులు, యౌవనులు, కుటుంబ పెద్దలు, గృహిణులు, పనిచేసే స్త్రీల వంటి రకరకాల వాళ్లను మనం కలుస్తాం. ప్రకటిస్తున్నప్పుడు వాళ్లవాళ్ల పరిస్థితులను మనసులో ఉంచుకొని వాళ్లకు నచ్చే సమాచారం గురించి మాట్లాడాలంటే, వివేచన కావాలి.

3 మీరు ఒక ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడి పరిసరాలను గమనించండి. అలాచేస్తే, ఇంటివాళ్లకు పిల్లలున్నారా? వాళ్లు ఏ మతస్థులు? ఇంటిని చక్కదిద్దుకోవడమంటే వాళ్లకు ఇష్టమా? లాంటి విషయాలు మీకు అర్థంకావచ్చు. అప్పుడు మీరు వాళ్ల పరిస్థితులకు, అభిరుచులకు తగినట్లు మాట్లాడగలుగుతారు. వివేచనతో నేర్పుగా ప్రశ్నలు అడుగుతూ, వాళ్లు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వింటే వాళ్ల నమ్మకాలు, మనోభావాలు మీకు తెలుస్తాయి. దానివల్ల, చర్చను ఎలా కొనసాగిస్తే బావుంటుందో మీకు అర్థమౌతుంది.

4 మనం యెహోవా సేవ కోసం ముందుగా సిద్ధపడి, వివేచన చూపిస్తే అపొస్తలుడైన పౌలులాగే ఇలా అనగలుగుతాం: “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.”—1 కొరిం. 9:22; సామె. 19:8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి