సత్క్రియల విషయంలో ఎందుకు ఆసక్తితో ఉండాలి?
సత్క్రియల విషయంలో మీరు ఆసక్తితో ఉన్నారా? అలా ఉండడానికి రాజ్య ప్రచారకులమైన మనకు తగిన కారణం ఉంది. మనం ఎందుకు ఆసక్తితో ఉండాలి? తీతు 2:11-14లో ఏమి ఉందో పరిశీలించండి:
11వ వచనం: “దేవుని కృప” అంటే ఏమిటి? దాని నుండి మనం వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం పొందాం?—రోమా. 3:23, 24.
12వ వచనం: దేవుని కృప వల్ల మనం ఎలా శిక్షణ పొందాం?
13, 14 వచనాలు: మనం ఇప్పుడు పవిత్రులమయ్యాం కాబట్టి, దేనికోసం ఎదురుచూడవచ్చు? ఏ గొప్ప ఉద్దేశంతో ఈ లోక భక్తిహీన ప్రవర్తన నుండి యేసు మనల్ని పవిత్రులను చేశాడు?
సత్క్రియలు చేయడానికి ఈ వచనాలు మిమ్మల్ని ఎలా కదిలిస్తున్నాయి?