ఎందుకు వెంటనే బయల్దేరాలి?
క్షేత్రసేవా కూటంలో మన చుట్టూ సహోదరసహోదరీలే ఉంటారు కాబట్టి వాళ్లతో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది. అయితే కూటం అయిపోయాక, వెంటనే క్షేత్రానికి బయల్దేరడం మంచిది. ఎందుకంటే, మన పరిచర్య ఇంకా ప్రాముఖ్యమైనది. (2 తిమో. 4:2) మనం ఆలస్యం చేసేకొద్దీ, పరిచర్యకు సమయం తగ్గిపోతుంది. పరిచర్య చేస్తున్నప్పుడు, తోటి ప్రచారకులతో మాట్లాడడానికి చాలా సమయం దొరుకుతుంది. ఆలస్యం చేయకుండా పరిచర్యకు బయల్దేరడంవల్ల మనం యెహోవాను, ఆయన కుమారుణ్ణి ఆసక్తిగా సేవిస్తున్నామని చూపిస్తాం.—రోమా. 12:11.