డిసెంబరు 29తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 29తో మొదలయ్యే వారం
పాట 21, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
jl 8-10 పాఠాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహోషువ 12-15 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: మనకు అప్పగించిన మంచి ధననిధి నుండి మంచి విషయాలను ఇద్దాం.—మత్త. 12:35ఎ.
20 నిమి: బైబిలు విద్యార్థులకు, మీ పిల్లలకు మంచి విషయాలను చక్కగా నేర్పించండి. (మత్త. 12:35ఎ) చర్చ. 1 కొరింథీయులు 13:11; 1 పేతురు 2:1-3 వచనాలను ఉపయోగిస్తూ బైబిలు విద్యార్థులు, మన పిల్లలు ఏమి చేయాలో చెప్పండి. “వాక్యమను పాల” “రుచి” చూడడం అంటే ఏమిటి, అలా రుచి చూసేందుకు మన విద్యార్థులకు, పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చో వివరించండి. మార్కు 4:28వ వచనం భావాన్ని వివరించండి. (కావలికోట డిసెంబరు 15, 2014, 12-13 పేజీలు, 6-8 పేరాలు చూడండి.) ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి బైబిలు విద్యార్థులకు లేదా పిల్లలకు ఎలా సహాయం చేశారో చెప్పమని అనుభవంగల ప్రచారకుడిని లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని ఇంటర్వ్యూ చేయండి.—ఎఫె. 4:13-15; మే 2014 మన రాజ్య పరిచర్య ప్రశ్నాభాగం చూడండి.
10 నిమి: “సహోదరులను ఇంటికి ఆహ్వానించి మీకున్న మంచి విషయాలను ఇవ్వండి (మత్త. 12:35ఎ).” చర్చ. సహోదరులను ఇంటికి ఆహ్వానించడం వల్ల వచ్చిన ప్రయోజనాలను లేదా అనుభవాలను అడగండి? ఇతరులను, ముఖ్యంగా పూర్తికాల సేవలో ఉన్నవాళ్లను ఇంటికి ఆహ్వానించినప్పుడు ఏమి చేయవచ్చో చెప్పమనండి. వేరే సంఘం నుండి ప్రసంగం ఇవ్వడానికి వచ్చే సహోదరులకు భోజన ఏర్పాట్లు మీ సంఘంలో ఎలా చేస్తున్నారో చెప్పండి.
పాట 50, ప్రార్థన