దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2014 డిసెంబరు 29తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
1. ఎవరైనా చనిపోయినప్పుడు, దుఃఖంతో శరీరాన్ని గాయపర్చుకోకూడదని ద్వితీయోపదేశకాండము 14:1లో ఉన్న ఆజ్ఞను మనమెలా చూడాలి? [నవం. 3, w04 9/15 27వ పేజీ, 5వ పేరా]
ఇశ్రాయేలు రాజులు దేవుని ధర్మశాస్త్రాన్ని నకలు రాసుకొని, ‘తాము బ్రదుకు దినములన్నిట ఆ గ్రంథమును చదువుచుండవలెను’ అని యెహోవా ఎందుకు ఆజ్ఞాపించాడు? (ద్వితీ. 17:18-20) [నవం. 3, w02 6/15 12వ పేజీ, 4వ పేరా]
“ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు” అని యెహోవా ఎందుకు చెప్పాడు? ఆ ఆజ్ఞలోని సూత్రం క్రైస్తవులకు ఎలా వర్తిస్తుంది? (ద్వితీ. 22:10) [నవం. 10, w03 10/15 32వ పేజీ]
“తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు” అని బైబిలు ఎందుకు చెప్పింది? (ద్వితీ. 24:6) [నవం. 17, w04 9/15 26వ పేజీ, 3వ పేరా]
ఇశ్రాయేలీయులు ఎలాంటి మనస్తత్వంతో విధేయత చూపించాలి? మనం యెహోవా సేవ ఎందుకు చేస్తాం? (ద్వితీ. 28:47) [నవం. 24, w10 9/15 8వ పేజీ, 4వ పేరా]
జీవం పొందడానికి ఏ మూడు పనులు చేయాలని ద్వితీయోపదేశకాండము 30:19, 20 చెబుతుంది? [నవం. 24, w10 2/15 28వ పేజీ, 17వ పేరా]
ఆదికాండము నుండి ప్రకటన వరకు ఉన్న మాటలన్నీ మనం తప్పకుండా లోగొంతుతో చదవాలా? వివరించండి. (యెహో. 1:8) [డిసెం. 8, w13 4/15 7వ పేజీ, 4వ పేరా]
యెహోషువ 5:14, 15లో ఉన్న “యెహోవా సేనాధిపతి” ఎవరు? ఆ లేఖన భాగం నుండి మనమెలా ప్రోత్సాహం పొందుతాం? [డిసెం. 8, w04 12/1 9వ పేజీ, 1వ పేరా]
ఆకాను పాపం చేసేలా ఏది నడిపించింది? ఆయన నుండి మనం ఏ గుణపాఠం నేర్చుకుంటాం? (యెహో. 7:20, 21) [డిసెం. 15, w10 4/15 20-21 పేజీలు, 2, 5 పేరాలు]
కాలేబు ఉదాహరణ నుండి నేడు మనమెలా ప్రోత్సాహం పొందవచ్చు? (యెహో. 14:10-13) [డిసెం. 29, w04 12/1 12వ పేజీ, 2వ పేరా]