ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
రాజ్యవార్త నం. 38
“ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కరపత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నాం. ఇది మీకోసం.”
గమనిక: క్లుప్తంగా మాట్లాడితే మీ ప్రాంతంలో అందరికీ దీన్ని అందించగలుగుతారు. ఒకవేళ ఇంటివాళ్లు నిజంగా ఆసక్తి చూపించి మాట్లాడడానికి ఇష్టపడితే, మొదటి పేజీలో ఉన్న ప్రశ్న మీద ఆయన అభిప్రాయం అడగండి. తర్వాత ఆ ప్రశ్నకు బైబిలు ఇస్తున్న సమాధానాన్ని కరపత్రంలో నుండి చదవండి. ఇంకా సమయముంటే కరపత్రంలోని కొంత భాగాన్ని పరిశీలించండి. వెళ్లేముందు, చివరి పేజీలోని “ఒక్కసారి ఆలోచించండి . . . ” కింద ఉన్న ప్రశ్నను చూపించి దాన్ని చర్చించడానికి మళ్లీ కలిసే ఏర్పాటు చేసుకోండి.