ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఆగస్టు: సంఘానికి అందుబాటులో ఉన్న 32 పేజీల ఏ బ్రోషుర్‌నైనా ఉపయోగించండి. పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా గృహస్థుల పరిస్థితిని బట్టి దేవుడు చెప్పేది వినండి బ్రోషుర్‌నైనా, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్‌నైనా ఇచ్చి బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించండి. సెప్టెంబరు, అక్టోబరు: కావలికోట పత్రిక. పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని పరిచయం చేయండి. లేదా గృహస్థుల పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి బ్రోషుర్‌నైనా, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్‌నైనా ఇవ్వడం మరింత సబబుగా ఉంటుందనుకుంటే అది ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. నవంబరు, డిసెంబరు: ఈ కరపత్రాల్లో దేన్నైనా ఉపయోగించండి: కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి, కృంగిన వారికి ఓదార్పు, బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, విధి మీ జీవితాన్ని నిర్ణయిస్తుందా?, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము. గృహస్థులు ఆసక్తి చూపిస్తే బైబిలు బోధిస్తోంది పుస్తకం గానీ, దేవుడు చెప్పేది వినండి బ్రోషుర్ గానీ, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్ గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తామో చూపించండి.
◼ సెప్టెంబరు మొదలుకొని ప్రాంతీయ పర్యవేక్షకులు ఇచ్చే బహిరంగ ప్రసంగాంశం, “దేవునితో నడిస్తే ఇప్పుడు, ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు పొందుతాం.”