బైబిలు సందేశం బ్రోషుర్ను ఉపయోగించే ఒక పద్ధతి
మన ప్రాంతంలో ఉన్న చాలామందికి, ముఖ్యంగా క్రైస్తవులుకాని వారికి బైబిలు గురించి తెలియదు. అలాంటి వారితో బైబిలు బోధిస్తోంది పుస్తకం నుండి అధ్యయనం చేస్తున్నప్పుడు కొందరు ప్రచారకులు తమ విద్యార్థులు బైబిలు సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసేందుకు బైబిలు సందేశం అనే బ్రోషుర్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఒక సహోదరుడు, బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని 3వ అధ్యాయం పరిశీలిస్తున్నప్పుడు ఈ బ్రోషుర్లోని 1వ భాగాన్ని చూపించాడు. అప్పటినుండి ప్రతీసారి అధ్యయనం ముగిసిన తర్వాత బ్రోషుర్లోని ఒక భాగాన్ని పరిశీలిస్తున్నాడు. బైబిలు గురించి అంతగా తెలియని వారితో లేక అస్సలు తెలియని వారితో మీరు అధ్యయనం చేస్తున్నారా? ‘రక్షణార్థమైన జ్ఞానం కలిగించడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలను’ తెలుసుకునేలా విద్యార్థికి సహాయం చేయడానికి బైబిలు బోధిస్తోంది పుస్తకంతోపాటు బైబిలు సందేశం బ్రోషుర్ ఉపయోగించండి.—2 తిమో. 3:14, 15.