సెప్టెంబరు 26తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
సెప్టెంబరు 26తో మొదలయ్యే వారం
పాట 21, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 40వ అధ్యాయం (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 142-150 (10 నిమి.)
నం. 1: కీర్తన 144:1–145:4 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: జయించడానికి సంసిద్ధులమవడం—wt 76-78 పేజీలు, 13-15 పేరాలు (5 నిమి.)
నం. 3: మనం ఎందుకు “పక్షపాత వైఖరి” చూపించకూడదు?—యాకో. 2:1-4, NW (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. “బైబిలు సందేశం బ్రోషుర్‌ను ఉపయోగించే ఒక పద్ధతి” అనే భాగాన్ని చర్చించండి. 4వ పేజీలో ఉన్న “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే భాగాన్ని ఉపయోగించి శనివారం అక్టోబరు 1న బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి. ఈ పనిలో భాగం వహించమని అందర్నీ ప్రోత్సహించండి.
10 నిమి: ప్రశ్నాభాగం. చర్చ. మార్చి 2005, మన రాజ్య పరిచర్య 8వ పేజీలో ఉన్న విషయాలను కూడా చర్చించండి.
15 నిమి: అక్టోబరు నెలలో పత్రిక ఇవ్వడానికి సిద్ధపడండి. చర్చ. మీ క్షేత్రంలోని వారికి ఆసక్తిగా ఉంటాయనిపించే కొన్ని ఆర్టికల్స్ గురించి ఒకట్రెండు నిమిషాలు మాట్లాడండి. తర్వాత, రెండుమూడు ఆర్టికల్స్‌ను ఎంపిక చేసుకుని ఒక్కొక్కటి ఎలా అందించవచ్చో పరిశీలించండి. అలా పరిశీలిస్తున్నప్పుడు ఆసక్తి రేకెత్తించే ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రిక ఎలా పరిచయం చేయవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
పాట 41, ప్రార్థన