కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/09 పేజీ 1
  • అత్యవసరంగా ప్రకటించండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అత్యవసరంగా ప్రకటించండి!
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తుంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మీ అత్యవసర భావాన్ని కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ప్రకటించే విషయంలో అత్యవసర భావాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2014
  • “యెహోవా మహా దినము సమీపమాయెను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 12/09 పేజీ 1

అత్యవసరంగా ప్రకటించండి!

1. పౌలు చేయమని చెప్పిన ఏ పని ఈ కాలంలో ప్రాముఖ్యమైనది?

1 ‘వాక్యాన్ని అత్యవసరంగా ప్రకటించండి.’ (2 తిమో. 4:2 NW) పౌలు చేయమని చెప్పిన ఆ పని ఈ కాలంలో మనకు ఎందుకంత ప్రాముఖ్యమైనది? అది మనపై, ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?

2. అంతకు ముందెప్పుడూ సువార్త వినని వారిని కలవడానికి మనమెందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాం?

2 ప్రాణాలను కాపాడుతుంది: ప్రపంచంలోని లక్షలాదిమందికి, రక్షణకు నడిపించే సువార్త ఇప్పటికీ చేరలేదు. (రోమా. 10:13-15; 1 తిమో. 4:16) ఎన్నోసార్లు పూర్తి చేసిన ప్రాంతాల్లో కూడా మంచి మనసున్న చాలామందిని కలుస్తుంటాం. ఒకే చోటుకు మరో రోజున లేదా మరో సమయంలో వెళ్లినప్పుడు వేరే వ్యక్తిని కలువవచ్చు. అలాంటి వారిని కలవడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించినప్పుడు మన మనస్సాక్షి మనలను తప్పుపట్టదు, మనం రక్తాపరాధం నుండి తప్పించుకుంటాం.—అపొ. 20:26.

3. పరిచర్యలో మన సమయాన్ని సరిగా ఉపయోగించుకోవడానికి మనమేమి చేయవచ్చు?

3 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు క్రూరమైన హింస అనుభవిస్తూ కూడా ‘యెరూషలేమును తమ బోధతో నింపేశారు.’ (అపొ. 5:28) మనం కూడా మన ప్రాంతంలోని ప్రజల మతాభిమానాన్ని మనసులో ఉంచుకొని, ఎక్కడ పరిచర్య చేయాలనే విషయంలో పెద్దలు ఇచ్చిన నిర్దేశాల్ని పాటిస్తూ ‘సమగ్రంగా సాక్ష్యమివ్వాలని’ నిర్ణయించుకున్నామా? (అపొ. 10:42, NW) పరిచర్యలో మన సమయాన్ని సరిగా ఉపయోగించుకుంటున్నామా? మనతో తీసుకువెళ్దాం అనుకున్న వాళ్లు మరో పునర్దర్శనం చేస్తుంటే వాళ్ల కోసం ఊరికే వేచివుండకుండా దారినపోయేవాళ్లను గమనించి వాళ్లతో మాట్లాడడానికి చొరవ తీసుకుంటున్నామా?

4. అత్యవసరంగా ప్రకటించడం ఏమరుపాటు లేకుండా, జాగ్రత్తగా ఉండడానికి మనకెలా సహాయం చేస్తుంది?

4 మనం జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేస్తుంది: ఈ వ్యవస్థ నాశనం దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు మనం ఏమరుపాటు లేకుండా, జాగ్రత్తగా ఉండాలి. (1 థెస్స. 5:1-6) మనం రాబోతున్న రాజ్యాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడుతూవుంటే ఈ లోకంలోని విషయాలలో కూరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. (లూకా 21:34-36) అప్పుడు, యెహోవా దినం కోసం ‘ఆశతో అపేక్షిస్తూ,’ ప్రాణాలను కాపాడే ప్రకటనా పనిని ఇంకా ఎక్కువగా చేయడానికి చూస్తాం.—2 పేతు. 3:11, 12.

5. జీవం అంటే గౌరవం ఉన్నప్పుడు పరిచర్య చేయడానికి ఎందుకు ముందుకొస్తాం?

5 అత్యవసరంగా ప్రకటించినప్పుడు జీవాన్ని గురించి యెహోవాకు ఉన్న ఆలోచనే మనకూ ఉందని చూపిస్తాం. ఆయన ‘ఎవరూ నశించాలని ఇచ్ఛయింపక, అందరూ మారుమనస్సు పొందాలని కోరుతున్నాడు.’ (2 పేతు. 3:9; యెహె. 33:11) కాబట్టి మన క్షేత్రంలో వీలైనంత ఎక్కువమందిని కలవడానికి కృషి చేద్దాం. అలా యెహోవాను స్తుతించగలుగుతాం!—కీర్త. 109:30.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి