డిసెంబరు 21తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
డిసెంబరు 21తో ప్రారంభమయ్యే వారం
పాట 29 (222)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my 8వ భాగం, 114వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహోషువ 9–11
నం. 1: యెహోషువ 9:1-15
నం. 2: జీవనోపాధి సంపాదించడమనే సవాలు (fy 105, 106 పేజీలు, 9, 10 పేరాలు)
నం. 3: దేవుని శాంతియుతమైన నూతనలోకం-మీరు అక్కడ ఉండవచ్చు
❑ సేవా కూటం:
పాట 2 (15)
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: కావలికోట అందించడానికి సిద్ధపడండి. గుంపు పైవిచారణకర్త తను పరిచర్యలో ఏమి మాట్లాడాలని సిద్ధపడ్డాడో యౌవన ప్రచారకునికి చెప్తూ ఆయన దాన్ని ఎందుకు ఎంచుకున్నాడో, ఏ ప్రశ్నలు అడగాలనుకుంటున్నాడో, ఏ లేఖనాలను చూపించాలనుకుంటున్నాడో వివరిస్తాడు. అప్పుడు ఆ యౌవన ప్రచారకుడు, తను కూడా ఒక విషయాన్ని గురించి ఆలోచించానని అయితే దాని గురించి చక్కగా ఎలా మాట్లాడాలో తెలియడం లేదని చెబుతాడు. ఆ ప్రచారకుడు అనుకున్న ఆర్టికల్ తీసి దాని గురించి మాట్లాడడానికి ఒక ప్రశ్న తయారుచేసుకుంటారు, కొన్ని లేఖనాలు ఎంచుకుంటారు.
15 నిమి: “మీ బైబిలు విద్యార్థుల కోసం ‘మీ ప్రాణం పెట్టండి.’” ప్రశ్నాజవాబుల చర్చ. 2వ పేరా చర్చిస్తున్నప్పుడు, ఒక ప్రచారకున్ని ఇంటర్వ్యూ చేస్తూ తన బైబిలు విద్యార్థుల మీద శ్రద్ధ చూపించడానికి ఆయన ఎలా కృషి చేస్తాడో చెప్పమనండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం వచ్చింది? తనకు బైబిలు అధ్యయనం చేసిన వారు తన మీద చూపించిన శ్రద్ధవల్ల ప్రయోజనం పొందిన ప్రచారకున్ని కూడా ఇంటర్వ్యూ చేయండి.
పాట 9 (37)