పత్రికల గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జనవరి-మార్చి
“అంతకంతకూ అధికమవుతున్న ఒత్తిడి మూలంగా వివాహబంధం సులభంగా దెబ్బతింటుంది. భార్యాభర్తలు తమ వివాహబంధాన్ని పటిష్ఠం చేసుకోవడానికి వారికేది తోడ్పడుతుంది? [వాళ్ళేమి చెబుతారో వినండి.] వివాహబంధంలో సంతోషానికి తోడ్పడే ప్రాచీన లేఖనాల్లోని ఒక సూత్రాన్ని మీకు చదివి వినిపించవచ్చా? [గృహస్థులకు ఆసక్తి ఉంటే ఎఫెసీయులు 5:33 చదవండి.] భార్యాభర్తలు తమ వివాహబంధానికి కట్టుబడి ఉండడానికి సహాయం చేసే వివిధ సూత్రాలను ఈ ఆర్టికల్ చర్చిస్తుంది.” 12వ పేజీలో ప్రారంభమయ్యే ఆర్టికల్‌ను చూపించండి.
కావలికోట ఏప్రిల్-జూన్
“చాలామందికి చనిపోయినవాళ్ళంటే భయం. ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటి? [వాళ్ళేమి చెబుతారో వినండి.] చనిపోయినవాళ్ళు ఏ స్థితిలో ఉంటారనేదాని గురించి మన జీవదాత ఏమి చెబుతున్నాడో మీకు చూపించవచ్చా? [గృహస్థులు చూపించమంటే, వినడానికి ఆసక్తి చూపిస్తే ఆదికాండము 3:19 చదవండి.] చనిపోయినవాళ్ళంటే మనమెందుకు భయపడనవసరం లేదో మరిన్ని కారణాలను ఈ ఆర్టికల్ చర్చిస్తుంది.” 13వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.