పత్రికల గురించి ఏమి చెప్పాలి?
కావలికోట అక్టో.-డిసెం.
“ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు నమ్మదగిన సలహాలు ఎక్కడ లభించగలవని మీరనుకుంటున్నారు? [వాళ్ళేమి చెబుతారో వినండి. ఆ తర్వాత, అనుమతి తీసుకుని సామెతలు 3:5, 6 చదవండి.] నిర్ణయాలు తీసుకోక ముందే వాటివల్ల వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించడంలోని దైవిక జ్ఞానాన్ని ఈ ఆర్టికల్ నొక్కిచెబుతుంది.” 8వ పేజీలోవున్న ఆర్టికల్ చూపించండి.
కావలికోట జన.-మార్చి
“ప్రేమగల దేవుడున్నాడనే నమ్మకానికి, నిరంతరం శిక్షించబడతామనే బోధకు పొంతన ఎలా కుదురుతుందని చాలామంది అనుకుంటారు. మీరేమనుకుంటున్నారు? [వాళ్ళేమి చెబుతారో వినండి.] దేవుడు పగతీర్చుకునేవాడు కాదని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. [ఇంటివాళ్ళకు ఆసక్తివుందని మీకనిపిస్తే యెహెజ్కేలు 18:23 చదవండి.] ఈ పత్రికలో లేఖనాల ఆధారంగా చెప్పబడిన విషయం ఎంతో కారణసహితంగా ఉన్నట్లు మీరు గ్రహిస్తారు.”