బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను, చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్న పుస్తకాలను మీరు ఉపయోగిస్తున్నారా?
1 అపొస్తలుడైన పౌలు ‘లేఖనములలోనుండి తర్కించడానికి’ కృషిచేశాడు. (అపొ. 17:2, 3; 18:19) ఆయన అలా కృషిచేయడంలో, తన శ్రోతలు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసేందుకు తరచూ లేఖనాల్లో నుండి ఎత్తి చెబుతూ, ఉపమానాలను ఉపయోగించిన యేసును అనుకరించాడు. (మత్త. 12:1-12) మనం కూడా అలాగే చేయడానికి తోడ్పడే విధంగా, బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను, చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్నపుస్తకాలు తయారుచేయబడ్డాయి.
2 ప్రభావవంతమైన ఉపోద్ఘాతాలను సిద్ధం చేసుకోవడం: బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్నపుస్తకంలోని 2-7 పేజీల్లో ఆసక్తిరేకెత్తించే ఉపోద్ఘాతాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా మీరు ఒకే క్షేత్రంలో తరచూ ప్రకటిస్తుంటే, వివిధ ఉపోద్ఘాతాలను నేర్చుకోవడం, ఉపయోగించడం వల్ల మీరు చేసే పరిచర్య మరింత అర్థవంతంగా తయారవుతుంది, అంతేకాక మీరు ఎన్నో రకాలుగా ఎంతో ఆసక్తికరమైన విధంగా సంభాషణలను ప్రారంభించగలుగుతారు. టెలిఫోను సాక్ష్యమిస్తున్నప్పుడు లేదా అధిక భద్రత ఉండే బిల్డింగుల్లో ఇంటర్‌కామ్‌లో మాట్లాడేటప్పుడు ఆ చిన్నపుస్తకంలోని ఉపోద్ఘాతాలను ఉపయోగించవచ్చు.
3 సంభాషణను ఆటంకపర్చేవారికి ఎలా జవాబివ్వవచ్చు? మీరు ప్రకటించడం ప్రారంభించకముందు, మీ క్షేత్రంలో సంభాషణను ఆటంకపర్చే ఎలాంటి ప్రతిస్పందన రావచ్చో ముందే ఊహించి, దానికి తగిన జవాబివ్వడానికి వీలుగా 7-13 పేజీలను ఎందుకు పరిశీలించకూడదు? కొంతమంది గృహస్థులు భౌద్ధమతస్థులు గానీ, హిందువులు గానీ, యూదులు గానీ, ముస్లింలు గానీ అయ్యుండవచ్చా? అలాగైతే 13-16 పేజీల్లోని సమాచారం సహాయకరంగా ఉంటుంది.
4 ప్రశ్నలకు జవాబివ్వడం: ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు లేదా ఏదైనా వివాదాంశాన్ని లేవదీసినప్పుడు చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్నపుస్తకం సహాయకరంగా ఉంటుంది. ఆ విషయానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను చూపించాలనుకుంటున్నాము అని ఆ వ్యక్తితో చెప్పి చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్నపుస్తకాన్ని బయటకు తీయవచ్చు. అందులోని అంశాలు అక్షర క్రమంలో ఉంటాయి కాబట్టి మీకు అవసరమైన సమాచారం ఉంటుందని మీరు భావిస్తున్న శీర్షికను తీయండి. తగిన సమాచారం మీకు దొరికిన వెంటనే మీ బైబిల్లో నుండి లేదా గృహస్థుల దగ్గరున్న బైబిల్లోనుండి లేఖనాలను సూటిగా చదవండి.
5 ఇతర ప్రయోజనాలు: ‘మీరెందుకు పండుగలు చేసుకోరు?’ వంటి ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సహాయకరంగా ఉంటుందని కొంతమంది చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్నపుస్తకాన్ని తమ ఉద్యోగస్థలంలో లేదా స్కూల్లో ఉంచుకుంటారు. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నవారినో మరణం మూలంగా తమ ప్రియమైనవారిని పోగొట్టుకున్నవారినో చూడడానికి వెళ్తున్నారా? లేఖనాధారిత ఓదార్పును ఇవ్వడానికి “మరణం” లేదా “పునరుత్థానం” అనే అంశాల క్రిందవున్న సమాచారం సహాయకరంగా ఉంటుంది. ప్రసంగాలు సిద్ధం చేసుకుంటున్నవారికి, క్షేత్రసేవా కూటాలు నిర్వహించేవారికి అవసరమైన సమాచారం కూడా చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్నపుస్తకంలో ఉంటుంది.
6 ప్రకటిస్తున్నప్పుడు, వాదించి గెలవాలన్నదో లేక కేవలం సమాచారాన్ని అందజేయడమో మన లక్ష్యం కాదు. మనం లేఖనాల్లోనుండి సమర్థవంతంగా తర్కించి చెప్పాలనుకుంటాం. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను, చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్నపుస్తకాలను చక్కగా ఉపయోగించుకున్నప్పుడు మనం మన బోధగురించి జాగ్రత్త కలిగివున్నామని చూపిస్తాం.—1 తిమో. 4:16.
[అధ్యయన ప్రశ్నలు]
1. అపొస్తలుడైన పౌలు, యేసు ఇతరులకు ఎలా బోధించారు?
2. ప్రభావవంతమైన ఉపోద్ఘాతాలను సిద్ధం చేసుకోవడానికి, బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్నపుస్తకాన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు?
3. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్నపుస్తకంలోని 7-13 పేజీల్లో మనకు పరిచర్యలో సహాయం చేసే ఏ సమాచారం ఉంది?
4. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు లేదా ఏదైనా వివాదాంశాన్ని లేవదీసినప్పుడు చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్నపుస్తకాన్ని మనమెలా ఉపయోగించవచ్చు?
5. చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్నపుస్తకం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
6. ప్రకటిస్తున్నప్పుడు మన లక్ష్యమేమిటి?