కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/09 పేజీలు 3-5
  • 2009 యెహోవాసాక్షుల జిల్లా సమావేశం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 2009 యెహోవాసాక్షుల జిల్లా సమావేశం
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • 2008 యెహోవాసాక్షుల జిల్లా సమావేశం
    మన రాజ్య పరిచర్య—2008
  • “దేవుని వాక్యాన్ని బోధించేవారు” యెహోవాసాక్షుల జిల్లా సమావేశం 2001
    మన రాజ్య పరిచర్య—2001
  • “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” యెహోవాసాక్షుల జిల్లా సమావేశము
    మన రాజ్య పరిచర్య—2000
  • 2003 “దేవుణ్ణి మహిమపరచండి” యెహోవాసాక్షుల జిల్లా సమావేశం
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 2/09 పేజీలు 3-5

2009 యెహోవాసాక్షుల జిల్లా సమావేశం

1 మనమందరం 2009 జిల్లాసమావేశం కోసం, ‘తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించిన’ తోటి యెహోవా ఆరాధకులను తిరిగి కలుసుకొనే కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తాం. (మత్త. 5:3) యెహోవా దినం త్వరలోనే వస్తుంది కాబట్టి, ప్రేమపూర్వకమైన క్రైస్తవ సహవాసం నుండి, విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి అవసరమైన ఆధ్యాత్మిక ప్రోత్సాహం నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి మూడు రోజులూ సమావేశానికి హాజరవమని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నాము. (జెఫ. 1:14) సమావేశాలకు వెళ్ళడం మీ ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన భాగమని ఉపాధ్యాయులకు, యజమానులకు తెలియజేయండి. ధైర్యంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి, యెహోవా ఆశీర్వాదం కోసం ప్రార్థించండి, ఆయన మీకు తప్పకుండా సహాయం చేస్తాడు.—యెష. 50:10.

2 ఇండియాలో అంతర్జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసే ఉద్దేశమేమీ లేదు. అంతర్జాతీయ సమావేశాలు కొన్ని దేశాల్లో మాత్రమే జరుగుతాయి కాబట్టి ఆ సమావేశానికి నియమించబడినవారే దానికి హాజరవ్వాలి. మనం ఈ ఏర్పాట్లకు సహకరిస్తే ఆ సమావేశాలకు మరీ ఎక్కువమంది వచ్చేసి గందరగోళం ఏర్పడకుండా ఉంటుంది. (1 కొరిం. 14:39, 40; హెబ్రీ. 13:17) ఇండియాలో ఈ సంవత్సరం చాలా జిల్లా సమావేశాలు సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఏర్పాటు చేయబడ్డాయి. డిసెంబరులో ఒకటి తమిళనాడులోనూ, మరొకటి కేరళలోనూ రెండు పెద్ద జిల్లా సమావేశాలు జరుగుతాయి.

3 ఇతరులు హాజరయ్యేందుకు సహాయపడండి: మీ సంఘంలో కొంతమందికి జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు సహాయం అవసరమా? అలా హాజరవడానికి మీరు ఇతరులకు సహాయం చేస్తే, ‘మీ సొంతకార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చూసినట్లవుతుంది.’—ఫిలి. 2:4.

4 సమాచారం ఎక్కడ లభిస్తుంది? సమావేశాలు ఎప్పుడు, ఏయే ప్రాంతాల్లో జరుగుతాయో తెలుసుకోవడానికి బ్రాంచి కార్యాలయానికి ఫోన్‌ చేయడాన్ని తగ్గించేందుకు, మీకు అవసరమైన సమాచారం కోసం, దయచేసి ముందు మీ సంఘ కార్యదర్శిని సంప్రదించండి.

5 మీ సంఘం నియమించబడిన సమావేశానికి కాక మరో సమావేశానికి వెళ్ళాలనుకుంటే సమావేశ ముఖ్య స్థలాల చిరునామాకు ఉత్తరం రాసి సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితాను తెప్పించుకోవచ్చు. ఈ సమాచారం మన రాజ్య పరిచర్య జూన్‌ 2009 సంచికలో ప్రచురించబడుతుంది. మీరు రాసిన ఉత్తరానికి జవాబు కోసం, మీ చిరునామాతోపాటు, స్టాంపులు అంటించిన కవరును జతచేసి పంపించండి.

6 ప్రత్యేక అవసరాలు: ప్రచారకులెవరైనా వసతి కావాలని అడిగితే, వారు స్పెషల్‌ నీడ్స్‌ రూమ్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ నింపడానికి అర్హులో కాదో సంఘ సేవా కమిటీ నిర్ణయించాలి. సంఘ కార్యదర్శి దీనిని సమావేశపు రూమింగ్‌డిపార్ట్‌మెంట్‌కు పంపించేముందు ఆ ఫారమ్‌లోవున్న, అలాగే ఫిబ్రవరి 14, 2009వ తేదీతో పెద్దల సభలన్నిటికీ రాయబడిన ఉత్తరంలోవున్న మార్గదర్శక సూత్రాలను పరిశీలించాలి.

7 హోటల్‌ గది బుక్‌ చేసుకోవడం: సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితా సంఘానికి అందిన వెంటనే అది సంఘంలోని సమాచార బోర్డు మీద పెట్టబడుతుంది. హోటల్‌ గది బుక్‌ చేసుకోవడానికి ముందు “రూమింగ్‌ నిర్దేశాలు” అనే బాక్సులోని సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. హోటల్‌ గది బుక్‌ చేసుకోవడానికి మీరు అనుసరించాల్సిన పద్ధతులు:

◼ హోటళ్ళ జాబితాలో ఉన్న హోటళ్ళ ఫోన్‌ నంబర్లకు పని వేళల్లోనే ఫోన్‌ చేయండి.

◼ మీరు యెహోవాసాక్షుల సమావేశానికి హాజరవుతున్నారని హోటల్‌ వారికి చెప్పండి.

◼ మీరు ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉంటారో స్పష్టంగా తెలియజేయండి.

◼ సరిపడా గదులు దొరక్కపోతే హోటళ్ళ జాబితాలో ఉన్న మరో హోటల్‌కు ఫోన్‌ చేయండి.

◼ గదిని బుక్‌ చేసుకున్నట్టుగా రసీదు ఇవ్వమని అడగండి.

◼ పది రోజుల్లో క్రెడిట్‌ కార్డ్‌ ద్వారానైనా, చెక్‌ లేక మనియార్డర్‌ ద్వారానైనా డబ్బు చెల్లించండి. చెక్‌ లేదా మనియార్డర్‌ ద్వారా డబ్బు పంపిస్తే, బుకింగ్‌ జరిగినట్లు నిర్ధారణ అయిన వివరాలను చెక్‌ లేదా మనియార్డర్‌ ముందుభాగంలో రాయండి. ఎప్పుడూ డబ్బు పంపించకండి.

8 హోటళ్ళ విషయంలో కొంతమందికి సొంత అభీష్టాలు ఉంటాయని మనం గ్రహిస్తాం. సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితాలోలేని హోటళ్ళలో రూమ్‌ బుక్‌ చేసుకుంటే లేదా ఆ జాబితాలో ఇవ్వబడినదానికన్నా ఎక్కువ రేటు చెల్లించడానికి మనం అంగీకరిస్తే రూమ్‌లు సరసమైన ధరలకు దొరికేలా ఏర్పాటు చేయడం సహోదరులకు కష్టమయ్యేలా చేస్తాం. మీరు ఉపయోగించుకోవాలనుకోని రూమ్‌లను రిజర్వేషన్‌ చేయించుకోకండి, లేదా వేరే హోటల్‌కు వెళ్ళడానికి గానూ ముందు రిజర్వు చేయించుకున్న గదులను చివరి నిమిషంలో క్యాన్సిల్‌ చేయకండి. మీరు ఈ ఏర్పాటుతో సహకరించడం ద్వారా ప్రతీ ఒక్కరూ సముచితమైన రేట్లలో హోటల్‌ రూమ్‌ బుక్‌ చేసుకోవడానికి సహాయం చేయగలుగుతారు.—1 కొరిం. 10:24.

9 దేవుణ్ణి మహిమపరిచే పనులు: హోటల్‌ సిబ్బందితో, సమావేశం జరుగుతున్న నగరంలోని ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనం మన మాటలకు, ప్రవర్తనకు సరైన అవధానమిస్తూ మన వ్యవహారాలన్నింటిలో ఆత్మఫలాన్ని ఫలిస్తే యెహోవా ప్రజలకు మరింత మంచి పేరు వచ్చేలా చేస్తాం, ఇతరులకు అభ్యంతరం కలిగించకుండా ఉంటాం. (1 కొరిం. 10:31; 2 కొరిం. 6:3, 4) మీరు సమావేశానికి హాజరవడం మూలంగా, మీ మంచి ప్రవర్తన మూలంగా 2009 జిల్లా సమావేశంలో దేవునికి మహిమ కలుగును గాక!—1 పేతు. 2:12.

[Study Questions]

1. (ఎ) సమావేశానికి మూడు రోజులూ హాజరవడం ద్వారా మనకు ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి? (బి) మనం ఇప్పుడే ఎలాంటి ఏర్పాట్లు వేసుకోవాలి?

2. (ఎ) అంతర్జాతీయ సమావేశాలకు ఎవరు మాత్రమే హాజరవ్వాలి? (బి) పెద్ద సమావేశాలు ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాయి?

3. మన సంఘంలోని కొంతమంది పట్ల క్రైస్తవ ప్రేమను మనమెలా చూపించవచ్చు?

4, 5. మీ సంఘం నియమించబడిన సమావేశానికి కాక మరో సమావేశానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడితే మీరు ఏమి చేయాలి?

6. ప్రత్యేక అవసరాలున్న ప్రచారకులెవరైనా వసతి కావాలని అడిగితే ఏ పద్ధతి పాటించాలి?

7. (ఎ) హోటల్‌ గది మనమెలా బుక్‌ చేసుకోవచ్చు? (బి) హోటల్‌ యాజమాన్యం దృష్టిలో మనకు మంచిపేరు ఉండాలంటే ఏ విషయాలు సహాయం చేస్తాయి? (“రూమింగ్‌ నిర్దేశాలు” అనే బాక్సు చూడండి.)

8. అందరూ సముచితమైన రేట్లలో హోటల్‌ రూమ్‌ బుక్‌ చేసుకోవడానికి మనమెలా సహాయం చేయవచ్చు?

9. మనం 2009 జిల్లా సమావేశానికి వెళ్ళడానికి సిద్ధమై, దానికి హాజరయ్యేటప్పుడు దేనికి ప్రాధాన్యతనివ్వాలి?

[3వ పేజీలోని బాక్సు]

కార్యక్రమ సమయాలు:

శుక్రవారం, శనివారం

ఉద. 9:20–సాయం. 4:55

ఆదివారం

ఉద. 9:20–సాయం. 4:00

[4వ పేజీలోని బాక్సు]

రూమింగ్‌ నిర్దేశాలు:

◼ 2009 మార్చి 2తో ప్రారంభమయ్యే వారంలో జరిగే సేవా కూటం అయ్యేంతవరకు హోటల్‌ గదులు బుక్‌ చేసుకోకండి.

◼ ఆ తర్వాత, సాధ్యమైనంత త్వరగా రిజర్వేషన్‌లు చేయించుకోవడానికి ప్రయత్నించండి.

◼ సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితాలోవున్న హోటళ్ళలో మాత్రమే ఉండండి.

◼ హోటళ్ళ జాబితాలో ఇవ్వబడిన దానికన్నా ఎక్కువ ధర చెల్లించడానికి అంగీకరించకండి.

◼ గదిలో ఎవరుంటారో వారి పేరు మీదే రూమ్‌ బుక్‌ చేయండి.

◼ హోటళ్ళ జాబితాలో చూపించబడినట్లుగా, హోటల్‌ నియమాలకు అనుగుణంగా ఒక గదిలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉండడానికి అనుమతివుందో అంతకంటే ఎక్కువమంది ఉండకండి.

◼ మీరు మొదట బుక్‌ చేసుకున్న హోటల్‌లోనే ఉండండి.—మత్త. 5:37.

◼ హోటళ్ళ జాబితాలో లేని హోటళ్ళకు ఫోన్‌ చేసి వారు మన సమావేశాలకు వచ్చేవారి కోసం ఏమైనా రాయితీ ఇస్తారేమోనని అడగకండి.

◼ హోటళ్ళ జాబితాలో ఉన్న అన్ని హోటళ్ళకు ఫోన్‌ చేసిన తర్వాత కూడా మీకు రూమ్‌లు దొరక్కపోతే లేదా ఏదైనా ఒక హోటల్‌తో మీకు సమస్య ఎదురైతే మీ సంఘ కార్యదర్శికి తెలియజేయండి. ఆయన సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితాలో ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తూ, సమావేశపు రూమింగ్‌ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాలి.

◼ రిజర్వేషన్‌ చేయించుకున్న గదులు మీకు అవసరం లేకపోతే వీలైనంత త్వరగా ఆ విషయాన్ని హోటల్‌ వారికి తెలియజేయండి. రిజర్వేషన్‌ రద్దుచేయబడిన వివరాలు మీకందేలా చూసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి