కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/09 పేజీ 2
  • ‘సువార్త కోసం సమస్తం చేయండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘సువార్త కోసం సమస్తం చేయండి’
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిస్థితికి తగినట్లు మారడానికి సిద్ధంగా ఉన్నారా?
    మన రాజ్య పరిచర్య—2013
  • ప్రకటించేందుకు వీలుగా మీరు మీ సమయ పట్టికను మార్చుకోగలరా?
    మన రాజ్య పరిచర్య—2006
  • మన రాజ్య ప్రకటనను మెరుగుపరచుకొనే మార్గాలు
    మన రాజ్య పరిచర్య—1994
  • రాజ్య సువార్త సాధ్యమైనంతమందికి అందుబాటులో ఉండేలా చేయడం
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 2/09 పేజీ 2

‘సువార్త కోసం సమస్తం చేయండి’

1 ఇతరులకు సువార్త ప్రకటించవలసిన వ్యక్తిగత బాధ్యత తనకుందని అపొస్తలుడైన పౌలు నమ్మాడు. (1 కొరిం. 9:16, 19, 23) అదే విధంగా ప్రజల శాశ్వత సంక్షేమం పట్ల మనకున్న శ్రద్ధ, వాళ్ళకు సువార్త ప్రకటించడానికి మనం చేయగలిగినదంతా చేసేలా మనల్ని పురికొల్పుతుంది.

2 ప్రజలు ఎప్పుడు, ఎక్కడ ఉంటారో అప్పుడు, అక్కడ ప్రకటించండి: ఒక మంచి జాలరి తన వలను తనకు అనుకూలంగా ఉన్న సమయంలో, తనకు అనుకూలంగా ఉండేచోట వేయడు గానీ చేపలు ఎప్పుడు, ఎక్కడ ఎక్కువగా దొరుకుతాయో అప్పుడు, అక్కడ వేస్తాడు. ‘మనుష్యులను పట్టేజాలరులముగా’ మనం కూడా మన క్షేత్రంలో ఉన్న ప్రజలను కలుసుకొని, తద్వారా “నానావిధములైన చేపలను” సమకూర్చే ఆధిక్యతను పూర్తిగా ఆనందించడానికి వ్యక్తిగతంగా కొన్ని సవరింపులు చేసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. (మత్త. 4:19; 13:47) ప్రజలు ఇళ్ళదగ్గర ఉండే సాయంకాలాల్లో ఇంటింటి సేవచేయడం, ఉదయకాలాల్లో రైల్వేస్టేషన్‌లలో, బస్టాండుల్లో అనియత సాక్ష్యమివ్వడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. పౌలు ‘సువార్త గురించి సమగ్రంగా సాక్ష్యమివ్వాలన్న’ లక్ష్యం పెట్టుకొని, అలా చేయడానికి తగిన అవకాశాలను ఆయన సద్వినియోగం చేసుకున్నాడు.—అపొ. 17:17; 20:20, 24, NW.

3 మీ క్షేత్రంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా మీ అందింపును మార్చుకోండి: ఏదైనా ఒక రకమైన చేపను పట్టాలంటే జాలర్లు తరచూ తమ పద్ధతులను మార్చుకుంటారు. మన క్షేత్రంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండే విధంగా మనం రాజ్య సువార్తను ఎలా ప్రకటించవచ్చు? సాధారణంగా ప్రజలు చింతించే ఏదైనా ఒక విషయాన్ని ప్రస్తావించేటప్పుడు మనం వాళ్ళ భావాలను పరిగణలోకి తీసుకొని, దాని గురించి వాళ్ళు తమ అభిప్రాయాన్ని చెబుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. (యాకో. 1:19) వాళ్ళ మనసులోని విషయాన్ని తెలుసుకోవడానికి మనం దృక్పథాన్ని రాబట్టే ప్రశ్న అడగవచ్చు. (సామె. 20:5) అలా మనం, వ్యక్తిగతంగా వారిపై ప్రభావం చూపించేలా మన సువార్త అందింపును మార్చుకోగలుగుతాము. మన పరిచయవాక్యాలు విన్న తర్వాత గృహస్థునికి కోపం వచ్చిందనో లేక చికాకు కలిగిందనో మనం గ్రహిస్తే, మంచి మాటలతోనే సంభాషణను ముగించి వెంటనే అక్కడినుండి వెళ్ళిపోవడం మంచిది. పౌలు “అందరికి అన్నివిధముల వాడు” అయ్యాడు. (1 కొరిం. 9:22) ప్రజల హృదయాలను చేరుకోవడానికి మనం సువార్త ప్రకటించడంలో తగిన మార్పులు చేసుకోవాలి.

4 ప్రజలకు “సువర్తమానము” ప్రకటించడం ఎంతటి ఆనందాన్నిస్తుందో! (యెష. 52:7) సాధ్యమైనంత ఎక్కువమందిని చేరుకోవడానికి మనం ‘సువార్త కోసం సమస్తం చేద్దాం.’—1 కొరిం. 9:23.

[Study Questions]

1. ఒక రాజ్యప్రచారకుడు ఇతరుల కోసం ఏమి చేయడానికి ఇష్టపడతాడు, ఎందుకు?

2. ప్రకటించేటప్పుడు మనం ఎలాంటి సవరింపులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాము, ఎందుకు?

3, 4. మనం పరిచర్య చేసేటప్పుడు ఏయే విధాలైన మార్పులు చేసుకోవాలి, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి