క్రొత్త ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం
“అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్తపడుము” అనేది 2009 సేవా సంవత్సరపు ప్రత్యేక సమావేశదిన కార్యక్రమ అంశం, ఇది కొలొస్సయులు 4:17 ఆధారంగా తీసుకోబడింది. క్రైస్తవులముగా మనం ఆ ఉపదేశాన్ని గంభీరంగా తీసుకుంటాం. యేసులాగే మన పరిచర్యను నమ్మకంగా నెరవేర్చాలన్నది మన లక్ష్యం. (యోహా. 17:4) ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు కూడా మనకు శ్రేష్ఠమైన మాదిరినుంచాడు. ఆయన పరిచర్యలో తన పరుగును తుదముట్టించాలని నిశ్చయించుకున్నాడు.—అపొ. 20:24.
ప్రాంతీయ పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం, వివిధ ప్రచారకులు తమ పరిచర్యలో సవాళ్ళను ఎలా అధిగమిస్తున్నారో చూపిస్తుంది. ఆ తర్వాత, “మీరు నాటిన దానిని వృద్ధిచేయండి” అనే ప్రసంగం, ‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగల వారికి’ మనం నిజంగా ఎలా సహాయం చేయవచ్చో చూపిస్తుంది. (అపొ. 13:48, NW) సందర్శక ప్రసంగీకుడు మొదట, “పరిచారకులముగా మనల్ని మనం ఎలా మెప్పించుకుంటాం?” అనే ప్రసంగంలో 2 కొరింథీయులు 6:1-10 వచనాలను ఒకదాని తర్వాత ఒకటి చర్చిస్తాడు. మధ్యాహ్నం ఆయన, “మీ పరిచర్యను అత్యంత విలువైనదిగా పరిగణించండి” అనే అంశంపై ప్రేక్షకులనుద్దేశించి ప్రసంగిస్తాడు. “యౌవనులారా, వృద్ధులారా పరిచర్యలో ఆనందించండి” మరియు “పరిచర్యను నెరవెర్చే యౌవనులు” అనే ప్రసంగాల నుండి మీరు తప్పక ప్రోత్సాహం పొందుతారు. రానున్న ప్రత్యేకదిన లేక ప్రాంతీయ సమావేశంలో, తమ సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాలనుకునేవారు వీలైనంత త్వరగా సంఘ పైవిచారణకర్తకు తెలియజేయాలి. మన సమావేశాలన్నిటిలో కావలికోట పత్రికను విధిగా పరిశీలిస్తాం. ప్రత్యేకదిన సమావేశం జరిగే వారంలో అధ్యయనం చేయబడే ప్రతిని మీతోపాటు తెచ్చుకోండి.
మన పరిచర్యను మనం తప్పక నెరవేర్చేలా చూసుకోవడానికి, యెహోవా మనకు అప్పగించిన దానిని ఇతర విషయాలు, కార్యకలాపాలు అడ్డుకోకుండా జాగ్రత్తపడేందుకు కృషిచేస్తాం. ఈ ప్రత్యేకదిన సమావేశ కార్యక్రమంద్వారా అందించబడే లేఖనాధారిత ప్రోత్సాహం, సరైన దృక్కోణాన్ని కాపాడుకునేందుకు మనమేమి చేయాలో అర్థం చేసుకోవడానికి, పరిచర్యను పూర్తిగా నెరవేర్చేందుకు మనం చేస్తున్నదానిని పరిశీలించుకోవడానికి సహాయం చేస్తుంది.