కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/07 పేజీ 6
  • నలిగిన హృదయంగలవారికి ఓదార్పు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నలిగిన హృదయంగలవారికి ఓదార్పు
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • దుఃఖిస్తున్నవారిని ఓదార్చండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • దేవుడు ఎలా ఓదారుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • ‘దుఃఖిస్తున్న వాళ్ళందర్నీ ఓదార్చండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఆదరణ మరియు ప్రోత్సాహము—అనేక కోణాలుగల రత్నాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 12/07 పేజీ 6

నలిగిన హృదయంగలవారికి ఓదార్పు

1 ఓదార్పు నేడు అవసరమైనంతగా ముందెన్నడూ అవసరం కాలేదు. మన రాజైన క్రీస్తుయేసు నాయకత్వాన మనం కూడా “నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకు” ప్రయత్నిస్తున్నాం.—యెష. 61:1.

2 ఓదార్చడమెలా: ప్రజలను ఓదార్చాలంటే మనం మన పరిచర్యలో జాగ్రత్తగా ఎన్నుకున్న, ప్రోత్సాహకరమైన మాటలను ఉపయోగించాలి. మనం లోకంలోని చెడు గురించి, అబద్ధ సిద్ధాంతాల గురించి మాట్లాడడం సాధ్యమైనంత తగ్గించి, లేఖనాల సత్యాన్ని, ఓదార్పుకరమైన దేవుని వాగ్దానాలు ఇచ్చే ఉజ్జ్వలమైన నిరీక్షణ గురించి ఎక్కువగా మాట్లాడాలి. అంటే హార్‌మెగిద్దోను గురించి అసలు మాట్లాడకూడదని దీనర్థంకాదు. “యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును” ప్రకటించడమేకాక ‘దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక’ చేయడం కూడా మన నియామకంలో భాగమే. అయితే, మనం హార్‌మెగిద్దోను గురించి హెచ్చరించడానికి, దాని వినాశకరమైన ఫలితాల గురించి చర్చించడానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వకుండా దేవుని రాజ్య సువార్త యొక్క ముఖ్యాంశానికి ప్రాముఖ్యతనివ్వాలి.—యెష. 61:2; యెహె. 3:18; మత్త. 24:14.

3 ఇంటింటి పరిచర్యలో: అనారోగ్యంవల్ల, తమ ఆత్మీయులు చనిపోవడంవల్ల, అన్యాయంవల్ల, ఆర్థిక ఇబ్బందులవల్ల నిరుత్సాహపడిన వారిని మనం కలుస్తూవుంటాం. క్రీస్తు అనుచరులుగా మనం మన పరిచర్యలో కలిసినవారిపట్ల ‘కనికరంతో’ సానుభూతిని చూపిస్తాం. (లూకా 7:13; రోమా. 12:15) వారి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లేఖనాలను చూపించినా మనం “వినుటకు వేగిరపడు” వారిగా ఉండాలి, అలా చేసినప్పుడు గృహస్థుడు నిర్మొహమాటంగా మాట్లాడతాడు. (యాకో. 1:19) మనం ముందు ఆయన చెప్పేది విన్నప్పుడే ఆయనను చక్కగా ఓదార్చగలుగుతాం.

4 సంభాషణ మధ్య తగిన సమయం చూసుకుని, “బైబిల్లో ఉన్న ప్రోత్సాహకరమైన కొన్ని మాటల్ని నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను” అని చెప్పవచ్చు. ఆ వ్యక్తికి ఉన్న ప్రతీ తప్పుడు అభిప్రాయాన్నీ వెంటనే సరిదిద్దకుండా ఉండేలా వివేచనను ఉపయోగించాలి. బదులుగా, వారి హృదయాలను బలపర్చడానికి లేఖనాలను ఉపయోగిస్తూ ప్రోత్సాహాన్ని, ఓదార్పును అందించడమే మన ముఖ్యోద్దేశంగా ఉండాలి. అందుకు లేఖనాలనుండి తర్కించడం (ఆంగ్లం) అనే పుస్తకంలోని 117-121 పేజీల్లో ఉన్న “ప్రోత్సాహం” అనే శీర్షిక కిందవున్న సమాచారాన్ని చూడండి. లేదా, గృహస్థునికి కృంగిన వారికి ఓదార్పు అనే కరపత్రాన్ని ఇచ్చి, అందులోవున్న ప్రోత్సాహకరమైన సమాచారాన్ని చర్చించండి.

5 ఇతరుల్ని ఓదార్చే అవకాశాల కోసం చూడండి: పొరుగువారిలో, తోటి ఉద్యోగస్థుల్లో, తోటి విద్యార్థుల్లో, కుటుంబ సభ్యుల్లో ఓదార్పు అవసరమైనవాళ్లు ఎవరైనా మీకు తెలుసా? లేఖనాల సహాయంతో వారిని ఓదార్చడం కోసం వారి ఇంటికి వెళ్లడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? వారికి ఓదార్పు ఎందుకు అవసరమో తెలుసుకున్నప్పుడు మీరు వారి పరిస్థితులకు తగినవిధంగా మాట్లాడేలా మీరు సిద్ధపడవచ్చు. కొందరు ఉత్తరాల ద్వారా లేదా ఫోన్‌ల ద్వారా ఇతరుల్ని ఓదార్చారు. పొరుగువారిపట్ల సానుభూతిని చూపేందుకు, లేఖనాల నుండి అవసరమైన ఓదార్పును ఇచ్చేందుకు వారిపట్ల ఉన్న నిజమైన ప్రేమ మనల్ని కదిలిస్తుంది.—లూకా 10:25-37.

6 అవును మనం దుఃఖించేవారిని ఓదార్చడానికి, నలిగిన హృదయం గలవారిని ప్రోత్సహించడానికి, వారిలో ఉజ్జ్వలమైన భవిష్యత్తును గురించిన నిరీక్షణను చిగురింపజేయడానికి నియమించబడ్డాం. లోక ప్రజలందరికీ ఇలాంటి ఓదార్పే అవసరం. దేవుడు వాగ్దానం చేసిన ఎన్నో ఆశీర్వాదాల గురించి మనం సంతోషంగా మాట్లాడడం ద్వారా యథార్థ హృదయులు ఓదార్పును, నిరీక్షణను పొందేందుకు తోడ్పడతాం. నలిగిన హృదయముగలవారిని ఓదార్చవలసిన అవసరముంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఉందుముగాక!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి