దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2007 డిసెంబరు 31వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2007 నవంబరు 5 నుండి డిసెంబరు 31 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
ప్రసంగ లక్షణాలు
1. సమర్థమైన ముగింపు కోసం మనమెలాంటి విషయాలు మనస్సులో పెట్టుకోవాలి? [be 220వ పేజీ, 4వ పేరా–221వ పేజీ, 3వ పేరా]
2. క్షేత్ర పరిచర్యలో మనం చెబుతున్న విషయం ఖచ్చితమైనదని ఎలా నిర్ధారించుకోవచ్చు? [be 223వ పేజీ, 2-4 పేరాలు]
3. ‘సత్యమునకు స్తంభముగా ఆధారముగా’ సంఘానికున్న పాత్రకు మనం ఎంతో విలువ ఇస్తున్నామని కూటాల్లో మనం అందించే సమాచారం ద్వారా ఎలా చూపించవచ్చు? (1 తిమో. 3:15) [be 224వ పేజీ, 1-4 పేరాలు]
4. మన సమాచారం నమ్మదగినదేనా అని పరిశీలించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం, ఆ సమాచారాన్ని నమ్మదగినదిగా ఎలా అందించవచ్చు? [be 225వ పేజీ, 1-2 పేరాలు]
5. బోధిస్తున్నప్పుడు ఇతరులకు సులభంగా అర్థమయ్యేలా మన సమాచారాన్ని ఎలా అందించవచ్చు? [be 226వ పేజీ, 3వ పేరా–227వ పేజీ, 1వ పేరా]
ఒకటవ నియామకం
6. యోనా వృత్తాంతం ప్రామాణికమైనదని ఏది రుజువు చేస్తుంది? [bsi07 18వ పేజీ, 3వ పేరా]
7. క్రీస్తుయేసు ద్వారా దేవుని రాజ్య పరిపాలన మీకా వ్రాసిన ఏ ప్రవచనంతో పొందికగా ఉంది? [bsi07 21వ పేజీ, 18వ పేరా]
8. హబక్కూకు పుస్తకం దేవునిచే ప్రేరేపించబడినదని ఏది రుజువు చేస్తుంది? [bsi07 23వ పేజీ, 4వ పేరా]
9. యూదులు తాము చెరనుండి తిరిగిరావడానికిగల సంకల్పాన్ని సా.శ.పూ. 520 వచ్చేసరికి ఇంకా నెరవేర్చలేదని ఎందుకు చెప్పవచ్చు? (హగ్గ. 1:4) [bsi07 27వ పేజీ, 3వ పేరా]
10. జెకర్యా ఏ మహిమాన్విత దినాన్ని పదేపదే ప్రస్తావించాడు? [bsi07 30వ పేజీ, 26వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. పురుగుల దాడిని గూర్చిన యోవేలు ప్రవచనం మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరింది, నేడు ఎలా నెరవేరుతోంది? (యోవే. 2:1-10, 28) [w07 10/1 “యెహోవా వాక్యము సజీవమైనది—యోవేలు, ఆమోసు గ్రంథాలనుండి ముఖ్యాంశాలు”]
12. “వేసవి కాలపు పండ్లగంప” దేనికి సూచనగా ఉంది? (ఆమో. 8:1, 2) [w07 10/1 “యెహోవా వాక్యము సజీవమైనది—యోవేలు, ఆమోసు గ్రంథాలనుండి ముఖ్యాంశాలు”]
13. ‘నీనెవెవారి గురించి యెహోవా చేస్తానన్నదాన్ని చేయకుండా’ ఏ భావంలో ‘పశ్చాత్తాపపడ్డాడు,’ ఇది మనల్నెలా ప్రభావితం చేయాలి? (యోనా 3:10) [w03 7/15 17-18 పేజీలు]
14. యెహోవా నామము స్మరిస్తూ నడుచుకోవడమంటే అర్థమేమిటి? (మీకా 4:5) [w03 8/15 17వ పేజీ, 19వ పేరా]
15. ఆధునిక కాలాల్లో యెహోవా తీర్పుతీర్చడానికి ఎప్పుడు, ఎలా ‘ఆలయానికి’ వచ్చాడు? (మలా. 3:1-3) [re 32వ పేజీ బాక్సు; jd 179వ పేజీ, 3వ పేరా–181వ పేజీ, 6వ పేరా]