ప్రశ్నా భాగం
◼ మనం అపరిచితులతో మాట్లాడేందుకు ఇంటర్నెట్ను ఉపయోగించే విషయంలో ఎలాంటి ప్రమాదాలున్నాయి?
ప్రజలు ఇంటర్నెట్ద్వారా కలుసుకునేందుకు, పరస్పర సంప్రదింపులు జరుపుకునేందుకు అనేక వెబ్సైట్లు రూపొందించబడ్డాయి. అలాంటి అనేక వెబ్సైట్లు వ్యక్తులు తమ ప్రొఫైల్‌ను అంటే తమ ఫోటోలు, ఇతర వ్యక్తిగత వివరాలు వంటివి తయారుచేసుకుని, అందులో పెట్టుకునే ఏర్పాటును కల్పిస్తున్నాయి. ఈ వివరాలను చూసేవారు ఆ తర్వాత వారిని సంప్రదించవచ్చు. అలాంటి వెబ్సైట్లను యౌవనస్థులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, సంఘంలోని కొందరు యౌవనస్థులు యెహోవాసాక్షులని చెప్పుకొంటున్నవారితో సంప్రదించేందుకు వాటిని ఉపయోగించారు.
ఇంటర్నెట్ద్వారా మనం కలుసుకునే వ్యక్తికి, తన గుర్తింపు గురించి, తన ఆధ్యాత్మికత గురించి, తన ఉద్దేశాలను గురించి తప్పుడు సమాచారాన్నివ్వడం చాలా తేలిక. (కీర్త. 26:4) తాను యెహోవాసాక్షినని చెప్పుకుంటున్న వ్యక్తి, నిజానికి అవిశ్వాసియైనా, బహిష్కరించబడిన వ్యక్తైనా లేదా చురుగ్గా పనిచేస్తున్న మతభ్రష్టుడైనా కావచ్చు. (గల. 2:4) నివేదికల ప్రకారం, అనేకమంది శిశుకాముకులు, తమ బాధితులను కనుగొనేందుకు అలాంటి వెబ్సైట్లనే ఉపయోగిస్తుంటారు.
మనం ఎవరితోనైతే సంప్రదింపులు జరుపుతున్నామో, వారికి సంఘంలో మంచి పేరుందన్న నమ్మకం మనకు కలిగినా, అలాంటి పద్ధతిలో జరిపే సంభాషణలు అనైతిక విషయాలను చర్చించేందుకు నడిపించగలదు. ఎందుకంటే, తాము వ్యక్తిగతంగా కలుసుకోని వ్యక్తులతో మాట్లాడడానికి ప్రజలు ఎక్కువగా సంకోచించరు. ఇంటర్నెట్ద్వారా ఇతరులతో జరిపే సంభాషణలు గోప్యంగా ఉంటాయని, తమ సంభాషణలు ఇతరులకు అంటే తమ తల్లిదండ్రులకు లేదా పెద్దలకు తెలియకుండా ఉంటాయని కూడా వారనుకోవచ్చు. విచారకరంగా, క్రైస్తవ కుటుంబాల్లోని అనేకమంది యౌవనులు ఆ ఉచ్చులో పడి, అసభ్యకరమైన మాటలకు అలవాటుపడ్డారు. (ఎఫె. 5:3, 4; కొలొ. 3:8) మరికొందరు, తమ కంప్యూటర్ ప్రొఫైల్‌లో లైంగికంగా రెచ్చగొట్టే తమ చిత్రాలను పెట్టుకుని, ఆ ప్రొఫైల్‌కు అశ్లీలమైన పేర్లు పెట్టారు, లేదా ఆ ప్రొఫైల్‌ని లైంగిక విషయాలు మాత్రమే ఉండే మ్యూజిక్ వీడియోలకు లింక్ చేసుకున్నారు.
పైన పేర్కొన్నదాని దృష్ట్యా, తల్లిదండ్రులు తమ పిల్లలు కంప్యూటర్ వాడే విధానాన్ని గమనించాలి. (సామె. 29:15) అపరిచిత వ్యక్తిని మన ఇంట్లోకి ఆహ్వానించడం లేదా మన పిల్లలతో ఒంటరిగా గడపడాన్ని అనుమతించడం ప్రమాదకరం కాగలదు. అలాగే, ఇంటర్నెట్లో అపరిచితులతో, తాము యెహోవాసాక్షులమని చెప్పుకుంటున్నవారైనా సరే స్నేహితులుగా చేసుకోవడం మనకు లేదా మన పిల్లలకు ప్రమాదకరం.—సామె. 22:3.