కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/07 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2007
మన రాజ్య పరిచర్య—2007
km 7/07 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జూలై, ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, అప్రమత్తంగా ఉండండి!, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి​—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలుసుకున్నప్పుడే బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక కృషి చేయండి. గృహస్థుల దగ్గర ఈ ప్రచురణ అప్పటికే ఉన్నట్లైతే, బైబిలు అధ్యయనాన్ని క్లుప్తంగా ప్రదర్శించడం ద్వారా వారు ఆ పుస్తకం నుండి ఎలా ప్రయోజనం పొందగలరో చూపించండి. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు ప్రతిపాదించండి. ఆసక్తి చూపించిన చోట, బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించి, దానిని చర్చించండి.

◼ ప్టెంబరు నెలలో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి సహాయ పయినీరు సేవ చేయడానికి అది అనువైన నెల.

◼ సెప్టెంబరు మొదలుకొని జిల్లా పైవిచారణకర్తలు “బైబిలు ప్రామాణికమైనదని ఏది నిరూపిస్తుంది?” అనే అంశం మీద బహిరంగ ప్రసంగాన్ని ఇస్తారు.

◼ క్రమ పయినీరు సేవ కోసం దరఖాస్తులను, పయినీరు సేవ ప్రారంభించడానికి అనుమతి కోసం అడిగిన తేదీకి కనీసం 30 రోజులకన్నా ముందు బ్రాంచి కార్యాలయానికి పంపించాలని సిఫారసు చేయబడుతోంది. సంఘ కార్యదర్శి, ఆ ఫారాల్లో పూర్తి వివరాలు ఉన్నాయో లేదో చూడడానికి వాటిని సమీక్షించాలి. దరఖాస్తుదారులకు తాము బాప్తిస్మం తీసుకున్న ఖచ్చితమైన తేదీ జ్ఞాపకం లేకపోతే వారు ఆ తేదీని అంచనా వేసుకొని ఆ తర్వాత ఎల్లప్పుడూ ఆ తేదీని ఉపయోగించాలి. సంఘ కార్యదర్శి ఆ తేదీని కాంగ్రిగేషన్స్‌ పబ్లిషర్‌ రికార్డ్‌ కార్డు (S-21) మీద వ్రాయాలి.

◼ అర్హతగల ప్రచారకులు, పయినీర్లు తమ సొంత నగరంలో లేదా మరింకెక్కడైనా అరుదుగా పనిచేసే క్షేత్రాల్లో ప్రకటించేందుకు వెళ్ళగలిగేవారు, వెళ్ళేందుకు ఆసక్తిగల వారు తమ ప్రయాణ పైవిచారణకర్తతో, తమ సంఘ సేవా కమిటీతో చర్చించవచ్చు. వారు ఒకవేళ ఆధ్యాత్మికంగా అర్హతగలవారైతే సేవా కమిటీ బ్రాంచి కార్యాలయానికి రాస్తుంది. (od 111వ పేజీలోని 1వ పేరా నుండి 112వ పేజీలోని 1వ పేరా వరకు చూడండి.)

◼ స్టాకులో ఉన్న పత్రికలతో సహా సాహిత్యాలన్నింటి వార్షిక ఇన్వెంటరీ 2007, ఆగస్టు 31న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలి. ప్రతీనెల లిటరేచర్‌ కో-ఆర్డినేటర్‌ లెక్కించే విధంగానే ఈ ఇన్వెంటరీ చేయాలి, అలా లెక్కించిన స్టాకు వివరాలను లిటరేచర్‌ ఇన్వెంటరీ (S-18) ఫారంలో ఎక్కించాలి. స్టాకులో ఉన్న పత్రికల మొత్తం సంఖ్యను పత్రికా సేవకు(ల)ని నుండి పొందవచ్చు. ఈ ఇన్వెంటరీని కో-ఆర్డినేటింగ్‌ సంఘ కార్యదర్శి పర్యవేక్షించాలి. ఆయనతోపాటు కో-ఆర్డినేటింగ్‌ సంఘ పైవిచారణకర్త కూడా ఆ ఫారం మీద సంతకాలు చేస్తారు. ప్రతి కో-ఆర్డినేటింగ్‌ సంఘం మూడు లిటరేచర్‌ ఇన్వెంటరీ (S-18) ఫారాలను అందుకుంటాయి. దయచేసి ఒరిజినల్‌ కాపీని బ్రాంచి కార్యాలయానికి సెప్టెంబరు 6వ తేదీకి ముందే పంపించండి. మీ ఫైళ్ళ కోసం ఒక కాపీ ఉంచుకోండి. మూడవ కాపీని చిత్తు ప్రతిగా ఉపయోగించుకోవచ్చు.

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

జీవిత సంకల్పమేమిటి​—⁠మీరు దానినెలా తెలిసికోగలరు?​—ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి