ప్రశ్నా భాగం
◼ దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను, సేవా కూటాన్ని, బహిరంగ ప్రసంగాన్ని, కావలికోట అధ్యయనాన్ని ప్రారంభించడానికి పాడే పాటను ఎలా పరిచయం చేయాలి, ఎవరు పరిచయం చేయాలి?
ప్రతీవారం జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను ప్రారంభించడానికి ఎంపికచేయబడిన పాటలు, అక్టోబరు మన రాజ్య పరిచర్య మధ్యపేజీల్లోవున్న దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టికలో ఇవ్వబడ్డాయి. ప్రతీవారం జరిగే సేవా కూటంలో పాడే ప్రారంభ, ముగింపు పాటలు మన రాజ్య పరిచర్య 2వ పేజీలో ఇవ్వబడ్డాయి. అలాగే, ప్రతీవారం జరిగే కావలికోట అధ్యయనానికి సంబంధించిన పాటలు ప్రతీ కావలికోట సంచికలో 2వ పేజీలో ఉంటాయి. కూటానికి ఎంపిక చేయబడిన పాటలు ఆ కూటంలో భాగంగా పరిగణించబడతాయి కాబట్టి, ముందటి కూటానికి అధ్యక్షునిగా వ్యవహరించే సహోదరుడు కాక తర్వాతి కూటాన్ని నిర్వహించే సహోదరుడు ప్రారంభ పాటను పరిచయం చేయాలి.
ఉదాహరణకు, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్త ప్రేక్షకులను ఆహ్వానిస్తూ, ప్రారంభ పాటను పరిచయం చేసి, పాఠశాలను నిర్వహిస్తాడు, ఆ తర్వాత సేవా కూటంలోని మొదటి భాగాన్ని నిర్వహించే సహోదరుణ్ణి ఆహ్వానిస్తాడు. సేవా కూటంలోని ఆ భాగాన్ని నిర్వహించే సహోదరుడు సేవా కూటాన్ని ప్రారంభించడానికి పాడే పాటను పరిచయం చేయాలి.
అదే విధంగా, బహిరంగ ప్రసంగపు ప్రారంభ పాటను ఛైర్మన్ పరిచయం చేస్తాడు. ఆయన, ప్రసంగీకుడు ఎంపిక చేసిన ప్రారంభ పాటను పాడేందుకు హాజరైనవారందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాడు. ఛైర్మన్ (లేదా ముందుగానే ఏర్పాటు చేయబడిన అర్హతగల మరొక సహోదరుడు) ప్రార్థనతో కూటాన్ని ప్రారంభిస్తాడు. ఆయన ప్రసంగీకుడిని, ఆయన ఇవ్వబోయే ప్రసంగాంశాన్ని పరిచయం చేస్తాడు. ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన, అప్పుడే ప్రసంగీకుడు చెప్పిన అంశాలను తిరిగి చెప్పకుండా ఇవ్వబడిన ఉపదేశానికి క్లుప్తంగా కృతజ్ఞతను తెలియజేస్తాడు. తర్వాతి వారంలో ఇవ్వబోయే బహిరంగ ప్రసంగపు అంశాన్ని ప్రకటించి, హాజరైనవారందరినీ కావలికోట అధ్యయనానికి ఉండమని కోరతాడు. అతిథి ప్రసంగీకుడి ద్వారా ఆయన సంఘానికి ప్రేక్షకులు తమ ప్రేమను తెలియజేయాలని ఇష్టపడుతున్నారా అని ఛైర్మన్ ప్రేక్షకులను అడగాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఛైర్మన్, కావలికోట అధ్యయన నిర్వాహకుణ్ణి వేదిక మీదకు ఆహ్వానిస్తాడు.
కావలికోట అధ్యయన నిర్వాహకుడు అధ్యయనానికి ముందు పాడాల్సిన పాటను పరిచయం చేస్తాడు. ఆయన ప్రచురణల్లో ముద్రించబడిన సూచనలకనుగుణంగా అధ్యయనాన్ని నిర్వహించి, ఆ తర్వాత ముగింపు పాటను పరిచయం చేస్తాడు. కావలికోట అధ్యయన నిర్వాహకుడు సాధారణంగా బహిరంగ ప్రసంగం ఇచ్చిన సహోదరుడిని ముగింపు ప్రార్థన చేసేందుకు ఆహ్వానిస్తాడు.
ఈ సాధారణ మార్గనిర్దేశాలు పాటించడం మన సంఘ కూటాలు అన్నిచోట్లా ఒకే పద్ధతిలో నిర్వహించబడేలా చూసుకోవడానికి సహాయపడతాయి.