సేవా కూటాల పట్టిక
మే 14తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (224)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 4వ పేజీలోని సూచనలను లేదా మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగించి, మే 15 కావలికోటను, ఏప్రిల్-జూన్ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.
20 నిమి: రాజ్య సంబంధ విషయాలకు స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా మద్దతివ్వడం. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 12వ అధ్యాయం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.
15 నిమి: “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే.”a సమయముంటే ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి.
పాట 6 (45) ముగింపు ప్రార్థన.
మే 21తో ప్రారంభమయ్యే వారం
పాట 21 (191)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రశ్నా భాగాన్ని సమీక్షించండి.
15 నిమి: మీరు మరో భాషను నేర్చుకోగలరు! తేజరిల్లు! ఏప్రిల్-జూన్, 2007 సంచికలోని 12-14 పేజీలపై ఆధారపడిన ప్రసంగం. సువార్తను విస్తృతంగా ప్రకటించేందుకు మరో భాషను నేర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో నొక్కి చెప్పండి.
20 నిమి: “మీరు దేవుని వాక్యాన్ని సమర్థిస్తారా?”b పరిచర్య పాఠశాల పుస్తకంలోని 143-4 పేజీల్లో ఉన్న బాక్సుల్లోని వ్యాఖ్యానాలను చేర్చండి.
పాట 1 (13), ముగింపు ప్రార్థన.
మే 28తో ప్రారంభమయ్యే వారం
పాట 5 (46)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. మే క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ జూన్ 1 కావలికోటను, ఏప్రిల్-జూన్ తేజరిల్లు! పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.
20 నిమి: జూన్‌లో కుటుంబ సంతోషం పుస్తకాన్ని ప్రతిపాదించండి. పుస్తకంలోని కొన్ని ప్రయోజనకరమైన అంశాలను చూపించి, స్థానిక క్షేత్రంలో మంచి ఫలితాలిచ్చే ప్రతిపాదనలను ఉపయోగిస్తూ ఈ పుస్తకాన్ని ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. సమయముంటే, పరిచయమున్నవారితో లేదా కుటుంబ సభ్యులతో ఈ ప్రచురణలను ఉపయోగించడం ద్వారా పొందిన చక్కని ఫలితాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.
15 నిమి: క్షేత్ర సేవ అనుభవాలు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సహాయ పయినీర్లు, తమ పరిచర్యను విస్తృతపరచుకోవడానికి కృషిచేసిన ఇతర ప్రచారకులు పొందిన అనుభవాలను చెప్పండి. అంతేకాక, బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యంతో పత్రికను అందించిన వారిని పునర్దర్శనం చేసినవారి అనుభవాలను చెప్పండి. ఒకటి లేదా రెండు మంచి అనుభవాలు పునర్నటింపజేయవచ్చు.
పాట 8 (53), ముగింపు ప్రార్థన.
జూన్ 4తో ప్రారంభమయ్యే వారం
పాట 17 (187)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “యెహోవాను స్తుతించడాన్ని మీ పిల్లలకు నేర్పించండి.”c 4వ పేరాను చర్చిస్తున్నప్పుడు జూలై 2005 మన రాజ్య పరిచర్యలోని 3వ పేరాలో ఉన్న వ్యాఖ్యానాలను చేర్చండి.
పాట 22 (130), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చ కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చ కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చ కొనసాగించండి.