కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/07 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2007
మన రాజ్య పరిచర్య—2007
km 5/07 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మేలో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తిగలవారిని పునర్దర్శనం చేస్తున్నప్పుడు లేదా జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక దైవపరిపాలనా కార్యక్రమాలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారితో బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యంతో బైబిలు బోధిస్తోంది అనే పుస్తకాన్ని ప్రతిపాదించడానికి కృషిచేయండి. జూన్‌లో: కుటుంబ సంతోషం అనే పుస్తకాన్ని అందించండి. జూలై, ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, అప్రమత్తంగా ఉండండి!, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి​—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే.

◼ జిల్లా సమావేశాల్లో ప్రపంచవ్యాప్త పని కోసం చెక్‌ రూపంలో లేదా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో ఇవ్వబోయే చందాలు, బ్రాంచి కార్యాలయానికి పంపించబోయే చెక్కులు లేదా డ్రాఫ్ట్‌లు “వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా” పేరున వ్రాయాలి, అవి బెంగుళూరులో చెల్లేవిధంగా పంపించాలి.

◼ పెద్దలు, విపత్తుకు ముందుగానే సిద్ధపడడం గురించిన జూలై 6, 2006వ తేదీతో పంపించిన ఉత్తరాన్ని సమీక్షించి, ప్రతీ ప్రచారకుడి ప్రస్తుత అడ్రస్‌ వారిదగ్గర ఉండేలా చూసుకోవాలి. విపత్తు సంభవించే ప్రాంతాల్లో అత్యవసరంగా సంప్రదించడానికి అదనపు సమాచారాన్ని పొందాలి. అయితే, అత్యవసర పరిస్థితుల్లోనేకాక, ప్రచారకులు ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే, అంటే వారు సెలవుల్లో వేరే ప్రాంతానికి వెళ్తున్నా, బిజినెస్‌ పనిమీద ఎక్కువరోజులు ఇంటికి దూరంగా ఉంటున్నా లేదా హాస్పిటల్లో ఉంటున్నా దీని గురించి వారి సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తతో లేదా మరొక పెద్దతో మాట్లాడడం వారికి సహాయకరంగా ఉంటుంది.

◼ లభ్యమవుతున్న క్రొత్త ప్రచురణలు:

“ప్రతిలేఖనము”​—విశ్వసనీయమైనది, ప్రయోజనకరమైనది, 2వ బ్రోషుర్‌ (ఈ బ్రోషుర్‌ 2007 దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఉపయోగించబడుతుంది)​—కన్నడ, తెలుగు, హిందీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి