కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/05 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2005
మన రాజ్య పరిచర్య—2005
km 11/05 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు నవంబరులో: గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం అందించండి. తమకు పిల్లలులేరని గృహస్థులు చెప్పినప్పుడు, వారికి జ్ఞానము పుస్తకాన్ని లేదా మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని ఇవ్వండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. లేనట్లయితే ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు వంటి పుస్తకాలను ప్రతిపాదించండి. జనవరిలో: 192 పేజీల ఏ పాత పుస్తకమైనా లేక 1991వ సంవత్సరానికి ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. గృహస్థులు పుస్తక ప్రతిపాదనను అంగీకరించకపోతే, అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్‌ను ప్రతిపాదించండి. ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి అనే పుస్తకాన్ని అందించాలి. ఈ పుస్తకం స్టాకులోలేని సంఘాలు, ప్రకటన ముగింపు! పుస్తకాన్ని లేక స్టాకులో అధికంగా ఉన్న వేరే పాత పుస్తకాన్ని ఉపయోగించవచ్చు.

◼ ఏప్రిల్‌ 17, 2006తో ప్రారంభమయ్యే వారం నుండి మనం మన సంఘ పుస్తక అధ్యయనంలో బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకాన్ని అధ్యయనం చేస్తాం. ఆ సమయంలో సంఘంలోని స్టాకులో సరిపోయేన్ని ప్రతులు అందుబాటులో ఉండాలి.

◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు డిసెంబరు 1న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘ అకౌంట్సు ఆడిట్‌ చేయాలి. నిర్వహణ లేక నిర్మాణం లాంటి వాటికి వేరే అకౌంట్‌ ఉన్నట్లయితే వాటిని కూడా ఆడిట్‌ చేయడానికి ఏర్పాటు చేయాలి. ఆడిటింగ్‌ పూర్తయిన తర్వాత, సంఘంలో తర్వాతి అకౌంట్సు రిపోర్టుతోపాటు దాన్ని చదవాలి.

◼ ప్రపంచవ్యాప్త పని కోసం, రాజ్యమందిర నిధి కోసం, చెక్కు లేక బ్యాంక్‌ డ్రాఫ్ట్‌ ద్వారా బ్రాంచి కార్యాలయానికి నేరుగా పంపించే విరాళాలు “The Watch Tower Society” పేర వ్రాయాలి.

◼ మార్పిడి ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణ—రోగి అవసరాలు, హక్కులు తీర్చడం అనే వీడియో ప్రోగ్రామ్‌, జనవరిలో నిర్వహించబడే సేవాకూటంలో చర్చించబడుతుంది. అవసరమైతే, వీలైనంత త్వరగా ఆ వీడియో కాపీల కోసం సంఘం ద్వారా రిక్వెస్టు చేసుకోవాలి.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?—ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, నేపాలీ, మరాఠీ, మలయాళం, హిందీ

బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి! (కరపత్రం నం. 27)—ఆంగ్లం, ఉర్దూ, కన్నడ, కొంకణి (రోమన్‌ లిపి), ఖాసి, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మణిపురి, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి