కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/07 పేజీలు 1-3
  • ‘పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు’
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • కష్టాలను మనమెలా దృష్టించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ఓర్పుకు ప్రతిఫలం లభిస్తుంది
    మన రాజ్య పరిచర్య—2004
  • కష్టాలు ఎదురైనా ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 7/07 పేజీలు 1-3

‘పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు’

1 క్రైస్తవులందరూ పరీక్షలను ఎదుర్కొంటారు. (2 తిమో. 3:12) ఆ పరీక్షలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, శోధన, హింస వంటి రూపాల్లోనేకాక మరితర విధాలుగా కూడా రావచ్చు. సాతాను రూపొందించే పరీక్షలు మనం వెనుకబడేలా, మన క్రైస్తవ పరిచర్యను నిర్లక్ష్యం చేసేలా లేదా దేవుని సేవించడాన్ని మానివేసేలా చేయడానికి ఉద్దేశించినవే. (యోబు 1:9-11) పరీక్షలను ఎదుర్కోవడం సంతోషానికి ఎలా దోహదపడుతుంది?​—2 పేతు. 2:9.

2 పరీక్షలకు సిద్ధపడండి: యెహోవా తన సత్య వాక్యంతోపాటు యేసు జీవితం గురించిన, బోధల గురించిన వృత్తాంతాలను మనకిచ్చాడు. యేసు మాటలను విని, వాటిని పాటించడంద్వారా మనం గట్టి పునాదిని వేసుకొని పరీక్షలకు సిద్ధపడతాం. (లూకా 6:47-49) మనం సంఘంలోని సహోదర, సహోదరీల నుండి సంఘ కూటాల నుండి, నమ్మకమైన బుద్ధిమంతుడునైన దాసుడు అందించే బైబిలు ఆధారిత ప్రచురణల నుండి కూడా బలాన్ని పొందుతాం. దేవుడిచ్చిన ప్రార్థనా వరాన్ని మనం తరచూ ఉపయోగిస్తాం.​—మత్త. 6:13.

3 యెహోవా మనకు నిరీక్షణను కూడా ఇచ్చాడు. యెహోవా వాగ్దానాలపై మనం దృఢమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నప్పుడు మన నిరీక్షణ “నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలె” ఉంటుంది. (హెబ్రీ. 6:19) బైబిలు కాలాల్లో, ఓడలు మంచి వాతావరణ పరిస్థితుల్లో కూడా లంగరు లేకుండా ఓడరేవు నుండి కదిలేవికావు. అకస్మాత్తుగా తుఫాను వస్తే, లంగరును వదలడంవల్ల బండరాళ్ళున్న తీరప్రాంతాన్ని ఓడ ఢీ కొనదు. అలాగే, దేవుని వాగ్దానాలపట్ల ఇప్పుడు మన నమ్మకాన్ని వృద్ధిచేసుకోవడం, ఎన్నో కష్టాలు ఉక్కిబిక్కిరి చేసినప్పుడు మనల్ని నిలకడగా ఉంచుతుంది. కష్టాలు హఠాత్తుగా రావచ్చు. లుస్త్రలో పౌలు, బర్నబా చేసిన ప్రకటనా పని మొదట చక్కగా స్వీకరించబడినా, యూదా వ్యతిరేకులు రావడంతో పరిస్థితి వెంటనే మారిపోయింది.​—అపొ. 14:8-19.

4 సహనం సంతోషాన్ని తీసుకొస్తుంది: వ్యతిరేకత ఉన్నా, ప్రకటనా పనిలో స్థిరంగా కొనసాగడం మనకు మనశ్శాంతినిస్తుంది. క్రీస్తుకోసం మనం అవమానం పొందడానికి పాత్రులమని ఎంచబడినప్పుడు మనం సంతోషిస్తాం. (అపొ. 5:40, 41) పరీక్షలను ఎదుర్కోవడం, వినయం, విధేయత, ఓర్పు లేక సహనం వంటి లక్షణాలను మరింతగా వృద్ధిచేసుకునేందుకు సహాయం చేస్తుంది. (ద్వితీ. 8:16; హెబ్రీ. 5:8; యాకో. 1:2, 3) యెహోవాపై ఆధారపడేలా, ఆయన వాగ్దానాలపై నమ్మకముంచేలా, ఆయనను ఆశ్రయించేలా అది మనకు బోధిస్తోంది.​—సామె. 18:10.

5 పరీక్షలు తాత్కాలికమైనవేనని మనకు తెలుసు. (2 కొరిం. 4:17, 18) అవి యెహోవాపట్ల మనకున్న ప్రగాఢమైన ప్రేమను చూపించేందుకు అవకాశాలనిస్తాయి. పరీక్షలను ఎదుర్కోవడం ద్వారా మనం సాతాను ఆరోపణలకు జవాబివ్వగలం. కాబట్టి, మనం నిరుత్సాహపడం! “పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు, ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు.”​—యాకో. 1:12, ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి