సేవా కూటాల పట్టిక
జూలై 9తో ప్రారంభమయ్యే వారం
పాట 2 (15)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ, జూలై 15 కావలికోటను, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.
15 నిమి: నిజమైన సంతోషాన్ని ఏది తీసుకొస్తుంది? కావలికోట, మే 15, 2006, 28-9 పేజీలు, 11-12 పేరాల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. సుఖాల కోసం లేదా లౌకిక ఉద్యోగం కోసం ప్రయత్నించే బదులు తన జీవితంలో పరిచర్యనే ప్రధానంగా చేసుకోవాలని నిర్ణయించుకున్న ఒకరిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. అలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకునేందుకు ఆయనకు లేదా ఆమెకు ఏది దోహదపడింది? ఇది సంతోషాన్ని ఎలా తీసుకొచ్చింది?
20 నిమి: ప్రశ్నా భాగం. ఒక పెద్ద నిర్వహించాలి. పూర్తి ఆర్టికల్‌ని చదివి, చర్చించండి.
పాట 21 (191) ముగింపు ప్రార్థన.
జూలై 16తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: సంఘ ప్రశాంతతను, పరిశుభ్రతను కాపాడడం. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం, 144వ పేజీ నుండి 150వ పేజీలోని ఉపశీర్షిక ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.
15 నిమి: “మనుష్యులందరు రక్షణపొందుతారు.”a సమాచారం స్థానికంగా ఎలా అన్వయిస్తుందో వివరించండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
జూలై 23తో ప్రారంభమయ్యే వారం
పాట 3 (32)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ ఆగస్టు 1 కావలికోట, జూలై-సెప్టెంబరు తేజరిల్లు! పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.
20 నిమి: ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి. కావలికోట, జనవరి 15, 2005, 21-3 పేజీల ఆధారంగా ప్రసంగం. ఆతిథ్యమిచ్చేవారిగా పేరుపొందిన ఒకరిద్దరు ప్రచారకులను క్లుప్తంగా ఇంటర్య్వూ చేయండి. ఆతిథ్యమివ్వడానికి వారు ఎలాంటి ప్రయత్నాలను చేశారు? ఫలితంగా వారు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆశీర్వాదాలను పొందారు? ఇతర భాషా సంఘాలతో క్షేత్రాన్ని పంచుకునే నగరంలోని సంఘాలు ఆతిథ్యం గురించిన ప్రసంగానికి బదులు SB:SSB ఏప్రిల్ 16, 2007 తేదీగల ఉత్తరాన్ని చర్చించాలి. చర్చను సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. క్రమంగా ఎన్ని పత్రికలు అవసరమో సమీక్షించి, ఆర్డరును మార్చుకోవాలి. ఉత్తరంలో పేర్కోబడినట్లు పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు ప్రచారకులు ఇతర భాషా బైబిలు అధ్యయనాలను అప్పగిస్తున్నారో లేదో కనుగొని వాటిని అప్పగించమని ప్రోత్సహించాలి.
15 నిమి: స్వయంత్యాగం యెహోవా ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. కావలికోట, నవంబరు 15, 2005, 8-9 పేజీల ఆధారంగా ప్రసంగం.
పాట 25 (204), ముగింపు ప్రార్థన.
జూలై 30తో ప్రారంభమయ్యే వారం
పాట 11 (85)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జూలై నెల క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తు చేయండి.
15 నిమి: మన పని తప్పుగా అర్థంచేసుకోబడినప్పుడు. అర్హతగల ఒక పెద్ద నిర్వహించాలి. SA:LLC ఏప్రిల్ 28, 2003 తేదీగల ఉత్తరంలో ఉన్న అంశాలను సమీక్షించండి. సమాచారాన్ని స్థానిక పరిస్థితులకు అన్వయించండి. ఇతర మతస్థుల మనోభావాలను నొప్పించగల ఎలాంటి కొన్ని వ్యాఖ్యానాలను ప్రచారకులు ఉపయోగిస్తున్నారు? జాగ్రాత్తగా ఉండాల్సిన విషయాన్ని, క్షేత్రాల్లో పెద్ద గుంపులుగా ఇటూ అటూ తిరగవద్దనే విషయాన్ని నొక్కిచెప్పండి.
20 నిమి: “‘పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు.’”b 3వ పేరాను చర్చిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా ఒక పరీక్ష ఎదురైనప్పుడు దృఢమైన విశ్వాసం తమకెలా సహాయం చేసిందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఒకటి, రెండు వ్యాఖ్యానాలను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు.
పాట 1 (13), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 6తో ప్రారంభమయ్యే వారం
పాట 7 (51)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “మనం పదే పదే ఎందుకు తిరిగి వెళతాం?”c 5వ పేరాను చర్చిస్తున్నప్పుడు, గతంలో సత్యాన్ని వ్యతిరేకించినా లేక దానిపట్ల ఆసక్తిలేకపోయినా, తర్వాత సత్యాన్ని గురించి మరింత తెలుసుకోవాలని ఎందుకు అనుకున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 22 (130), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.