వారికి సహాయపడే మార్గం
నిజ క్రైస్తవులు సువార్తను వ్యాపింపజేసే బహిరంగ పరిచర్యలో పాల్గొంటారు. (ఫిలి. 2:17) ఆ కార్యాన్ని సాధించే మార్గంగా కొన్ని ముఖ్యమైన బ్రోషుర్లు, కరపత్రాలు, ఆర్టికల్లు 20 భాషల్లో ఇంటర్నెట్లో www.watchtower.org.లో ఉన్నాయి. ఈ వెబ్సైట్ యెహోవాసాక్షులకు తాజా ప్రచురణలను పంపిణీ చేసేందుకు రూపొందించలేదు. యెహోవాసాక్షులు బైబిలు నుండి ఏమి బోధిస్తారో తెలిపే ఖచ్చితమైన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచడమే ఈ వెబ్సైట్ లక్ష్యం.
సాధికారమైన మన వెబ్సైట్లో ఇటీవలే ఒక విశేషమైనది చేర్చబడింది. అదేమిటంటే 220 కంటే ఎక్కువ భాషల్లో, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషుర్. అంతేకాక జనవరి 1, జనవరి-మార్చి 2004, సంచికల నుండి కావలికోట, తేజరిల్లు!లు అన్ని భాషల్లో చివరి పేజీపై మన వెబ్సైట్ అడ్రస్‌ను చూపిస్తాయి.
ఈ ఉపకరణాన్ని మీరు ఎలా ఉపయోగించవచ్చు? ఆసక్తి చూపిస్తున్నట్లున్న ఒక వ్యక్తిని మీరు కలిశారు కానీ ఆయనకు మీరు మాట్లాడే భాష అర్థం కాదనుకోండి. ఆయన ఇంటర్నెట్కు వెళ్తున్నట్లయితే, ఆయనకు కావలికోట లేదా తేజరిల్లు! వెనుక పేజీలో ఉన్న మన వెబ్సైట్ అడ్రస్ చూపించవచ్చు. ఆ విధంగా ఆయన ఆ సైట్లో దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను తన భాషలో పరిశీలించగలుగుతాడు. ఈ లోగా మీరు ఆయన భాషలోని సాహిత్యాలను తీసుకొని పునర్దర్శనానికి వెళ్ళే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఆయన భాష మాట్లాడేవారిని చూసుకుంటున్న సంఘానికి గానీ గుంపుకు గానీ మీరు ఆ వ్యక్తి అడ్రస్‌ను ఇవ్వవచ్చు.